గోదావరి పుష్కరాలు రాజమండ్రి నగరానికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
రాజమండ్రి: గోదావరి పుష్కరాలు రాజమండ్రి నగరానికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గడచిన ఎనిమిది రోజులుగా నగరంలో చిన్న హోటల్ నుంచి స్టార్ హోటల్ వరకూ, చిన్న మెస్ నుంచి బడా రెస్టారెంట్ వరకూ అన్నీ కిక్కిరిసిపోతునే ఉన్నాయి. లక్షలాదిగా వస్తున్న భక్తులు షాపింగ్ చేస్తూండడంతో వస్త్ర వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. పుష్కరాలు ప్రారంభమైన తరువాత గత ఎనిమిది రోజుల్లోనూ రాజమండ్రిలో ఈ మూడు రంగాలూ కలిపి సుమారు రూ. 49 కోట్ల వ్యాపారం చేసినట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అంచనా వేస్తోంది.
చిన్నాచితకా వ్యాపారాలు కలిపి మొత్తం టర్నోవర్ రూ.100 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. ఇక్కడ సాధారణ రోజుల్లో పేరొందిన హోటల్‌లో రోజుకు రూ. 60 వేల వ్యాపారం జరుగుతుంది. కానీ పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు రూ. 2 లక్షలకు మించి టర్నోవర్ జరుగుతోంది. అల్పాహారం, భోజనం హోటళ్లు రోజుకు రూ. 1.04 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. వసతి వ్యాపారం రోజుకు రూ. 3 కోట్లకు మించి జరుగుతోంది.పుష్కర రద్దీని తట్టుకోలేక స్థానిక ప్రజలు తమ షాపింగ్‌లను వాయిదా వేసుకోవడమే కారణమని చాంబర్ ఆఫ్ కామర్‌సకు చెందిన ఓ వ్యాపారవేత్త సాక్షి’కి వివరించారు.