చవితికి ‘సమైక్య’ సెగ | Cavitiki 'united' Sega | Sakshi
Sakshi News home page

చవితికి ‘సమైక్య’ సెగ

Published Mon, Sep 9 2013 3:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

Cavitiki 'united' Sega

సమైక్యాంధ్ర ఉద్యమ సెగ వినాయకచవితి పండుగను తాకింది. జీతాలు రాక ఉద్యోగులు, వ్యాపారాలు జరక్క వ్యాపారులు, పనుల్లేక కార్మికులు, కర్షకులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో పండుగ రావడంతో పెద్దగా ప్రాధాన్యత సంతరించుకోలేదు. పండుగల కంటే సమైక్యాంధ్రనే తమకు ముఖ్యమన్న రీతిలో అన్ని వర్గాల ప్రజలు ముందుకెళుతున్నారు.
 
సాక్షి, తిరుపతి: తిరుపతికి చెందిన రమణయ్య ప్రభుత్వ ఉద్యోగి. నెలకు రూ.12వేలు జీతం వస్తుంది. అం దులో ఇంటిఅద్దె రూ.4వేలుపోను నిత్యావసర సరుకులకు నెలకు రూ.5వేలు ఖర్చు చేస్తారు. ఈ నెల జీతం రాలేదు. చేసేదిలేక నిత్యావసర వస్తువుల కొనుగోలులో పొదుపు పాటిస్తున్నాడు. రూ.2వేలకు మాత్రమే సరుకులు కొనుగోలు చేశా రు. ప్రతి వినాయకచవితికి కొత్తబట్టలు కొన డం, పిండి వంటలు చేసుకునే రమణయ్య ఈసారి బట్టలు కొనుగోలు చేయలేదు.

జేబులో రూ.500 పెట్టుకుని ఆదివారం మార్కెట్‌కు వచ్చా డు. పూలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు గోజారి..గోజారి కొనుగోలు చేయ టం కనిపించింది. ఆయన్ను సాక్షి పలకరిస్తే ‘ఏం చేయాలి? కాంగ్రెస్ చేసిన అనాలోచిత నిర్ణయం ఇటు మాలాంటి ఉద్యోగులు, అటు వ్యాపారుల బతుకులపై పడింది. అందుకే సరుకులు పెద్దగా కొనుగోలు చేయలేకపోతున్నాను. ధరలు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయి. అం దుకే వినాయకచవితిని ‘మమ’ అనిపించాలని నిర్ణయించుకున్నాం. గత ఏడాది ఘనంగా జరునుకున్నాం’ అని చెప్పుకొచ్చారు.
 
కాంగ్రెస్ తెచ్చిన తంట..

 సీడబ్ల్యూసీ చేసిన ప్రత్యేక తెలంగాణ  ప్రకటన సీమాంధ్రుల బతుకులపై నీళ్లు చల్లింది. విభజన ప్రకటనతో ఊరూవాడా, చిన్నాపెద్ద, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, కూలీలు, రైతులు తమ పనులన్నీ పక్కనపెట్టి ఉద్యమబాట పట్టారు. 40 రోజులుగా చేస్తున్న ఉద్యమంతో జిల్లాలో 40వేల మంది ఉద్యోగులకు సెప్టెంబర్‌లో రావాల్సిన జీతాలు రాలేదు. మరో 10వేల మంది ఆర్టీసీ కార్మికులకు కూడా వేతనాలు అందలేదు. సమ్మె వల్ల దుకాణాలు తెరుచుకోలేదు. కొనుగోలుదారులూ ముందు కు రాలేదు.

వ్యాపార లావాదేవిలన్నీ స్తంభించిపోయాయి. ఉద్యమం నేపథ్యంలో వినాయక చవితి రానే వచ్చింది. ఈ పండుగను ప్రతి ఏడా దీ ఘనంగా జరుపుకుంటారు. అటువంటిది ఈసారి సాదాసీదాగా జరుపుకుంటున్నారు. కారణం జీతాలు రాకపోవడం, పనులు దొరక్కపోవటంతో కూలి నిలిచిపోయింది. ఎగుమతులు లేక కూరగాయలు, నిత్యావసర వస్తువు ల ధరలు ఆకాశాన్నంటాయి.మార్కెట్‌కు వచ్చే జనం సంచి నిండా డబ్బుతో వచ్చి చేతినిండా సరుకులతో తిరిగి వెళుతున్నారు.
 
 తగ్గిన వ్యాపారం
 వినాయకచవితి నాడు తిరుపతిలోని ప్రతి బట్టల దుకాణం కొనుగోలుదారులతో రద్దీగా ఉండేది. ఈసారి బాగా తగ్గింది. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ప్రజలకు, వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు, మూడు వేలకు దుస్తులు కొనేవారు. ఇప్పుడు 5, 6 వందలతోనే సరిపెట్టుకుంటున్నారు. గత ఏడాది కంటే 50 శాతం వ్యాపారం పడిపోయింది.
 -పసుపర్తి గోపినాథ్, వస్త్ర వ్యాపారి

 తగ్గిన పండ్ల కొనుగోళ్లు
 వినాయక చవితి పండుగకు పండ్ల కొనుగోళ్లు బాగా తగ్గాయి. చవితి వేడుకల్లో గణపతి దేవునికి సమర్పించక తప్పదన్న విధంగా  అంతంత మాత్రంగా పండ్లు కొంటున్నారు. చవితి నాడు కేజీల లెక్కన కొనే వారు రెండు మూడు పండ్ల లెక్కన కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు. తెల్లారి నుంచి వ్యాపారం చేస్తున్నా గిట్టుబాటు కావడం లేదు. ఉద్యమం వ్యాపారంపై పూర్తి ప్రభావం చూపుతోంది.               
-మునెమ్మ, పండ్ల వ్యాపారి

 తక్కువ కొంటున్నారు
 వినాయకచవితికి ప్రతి ఒక్కరూ పండుగ సరుకులు రూ.500లకు కొనుగోలు చేసేవారు. దుకాణం వద్ద  రద్దీగా ఉండేది. ఈ ఏడాది ప్రజలు సరుకులు తక్కువగా కొంటున్నారు. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నెల రోజులకుపైగా ఆందోళనలు జరుగుతున్నాయి. జీతాలు లేక సర్దుకోవడం కనిపిస్తోంది. 5, 6 వందలకు కొనేవారు వంద, రెండు వందలకే కొంటున్నారు.         
-నిరంజన్, సరుకుల దుకాణదారుడు
 
 తగ్గిన పూల వ్యాపారం
 వినాయక చవితి అంటే పూల వ్యాపారం ఊపందుకుంటుంది. ఈ ఏడాది సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వ్యాపారం బాగా తగ్గిపోయింది. పూల దిగుమతులు కూడా అంతంత మాత్రమే. ధరలు కూడా పెరిగాయి. దీంతో 50 వేలు జరిగే వ్యాపారం 10 వేల రూపాయలకు పడిపోయింది.          
-భార్గవ్, పూల వ్యాపారి
 
 కూరగాయల వ్యాపారం పర్వాలేదు
 వినాయక చవితి పండుగ రోజు ప్రతిఒక్కరూ  కూరగాయలు బాగా కొనుగోలు చేసేవారు. సమైక్యాంధ్ర నిరసనల కారణంగా రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో కూరగాయల ధరలు కూడా బాగా పెరిగాయి. గత ఏడాదితో పోల్చితే వ్యాపారం బాగా తగ్గినా కొంత పర్వాలేదు అనిపిస్తోంది.                            
 -బాషా, కూరగాయల వ్యాపారి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement