సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ వర్షాలు, తగ్గిన దిగుబడి, కరువైన గిట్టుబాటు ధరలు రైతులను ‘తెల్ల’బోయేలా చేస్తే.. ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లకు దూరంగా ఉన్నాయి. జిల్లాలోని 17 వ్యవసాయ మార్కెట్లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా మంగళవారం నాటికి ఒక్క క్వింటాల్ కూడా కొనుగోలు చేయలేదు. మార్కెట్‌లో దళారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లలో రోజు గరిష్టంగా రూ.4,400 నుంచి రూ.4,300 ప్రకటిస్తున్నా తేమ పేరిట రూ.340 నుంచి రూ.520 వరకు కోత విధిస్తుండటంతో క్వింటాల్‌కు రూ.3,850 కూడా గిట్టుబాటు కావడం లేదు. జిల్లాలో అంచనాకు మించి సాగైనా వర్షాలకు 1.20 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. కరువు కోరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మృగ్యం కాగా, చేతికందిన పంటలకు గిట్టుబాటు దక్కడం లేదు.
‘గిట్టుబాటు’ పేరు.. ‘తేమ’తో కోత..
పత్తి కొనుగోళ్లు పద్ధతి ప్రకారం జరిగే విధంగా కలెక్టర్ అహ్మద్ బాబు గాడిన పెట్టారు. ఒకేసారి జిల్లాలోని మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,000 కాగా అక్టోబర్ 30న కొనుగోళ్ల సందర్భంగా రూ.4,520 ప్రకటించారు. ఆదిలాబాద్, భైంసా, లక్సెట్టిపేట, బోథ్, మంచిర్యాల తదిత ర మార్కెట్లలో రోజు పత్తి ధర మద్దతును ప్రకటిస్తున్నా, ఆ ధరను వ్యాపారులు కేవలం 15 నుం చి 20 క్వింటాళ్లకే పరిమితం చేస్తున్నారు. ఆ త ర్వాత తేమ పేరిట కిలోకు ఆ రోజు ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కోత విధిస్తున్నారు. మం గళవారం ఆదిలాబాద్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.4,431 ప్రకటించిన వ్యాపారులు కొందరికి పత్తి రకాల పేరిట చివరకు రూ.3,850 చెల్లించా రు. తేమ 12శాతంకు మించితే కిలోకు రూ. 44.31 చొప్పున కోత విధించారు. ఒకే రోజు రెం డు వేల క్వింటాళ్లకు వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇదే పద్ధతిని కొనసాగించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. జిల్లా వ్యాప్తంగా ఇ దే తంతు కొనసాగిస్తుండటంతో పత్తి రైతులు బిక్కు బిక్కుమంటున్నారు. ఓ వైపు కరువు, మరోవైపు ‘మద్దతు’ కరువై ఇప్పటికే జిల్లాలో 36 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, ప్రభుత్వం కనీసంగానైనా స్పందించడం లేదు. పెట్టుబడులు, విత్తులు, ఎరువుల కోసం పెద్దమొత్తంలో వెచ్చించిన పత్తిరైతులు ఆశలసౌధం నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, పాలకుల నిర్లక్ష్యం, దళారుల దోపిడీ పత్తి రైతులను చిత్తు చేస్తుంది.
కొనుగోళ్లకు సీసీఐ ‘సున్న’ం
అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ పె రుగుతుండగా వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నార ని రైతులు ఆరోపిస్తున్నారు. ఎగుమతులపై స్ప ష్టత లేదన్న సాకుతో సిండికేట్‌గా మారిన పత్తి వ్యాపారులు జిల్లాలో పత్తి ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ద్వారా రైతుల నుంచి గతేడాది నవంబర్ 20 వరకు 12,70,215 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తే ఈ సారి 3,36,472 క్వింటాళ్లే తీసుకున్నారు. ఈ ఏడాది వర్షాల కారణంగా పత్తి దిగుబడి ఆల స్యంగా రాగా, కొనుగోళ్లను కూడా ఆలస్యంగానే ప్రారంభించారు. అయితే గతేడాది ప్రైవేట్ వ్యా పారులకు తోడు సీసీఐ, నాఫెడ్‌లు బాసటగా నిలిస్తే, ఈసారి 17 మార్కెట్లలో మొత్తం 3,36,474 క్వింటాళ్లు వ్యాపారులే ఖరీదు చేశా రు. సీసీఐ మాత్రం ఇప్పటికే దూదిపింజను ము ట్టలేదు. తేమ పేరిట పాయింట్‌కు రూ.42 నుం చి 46 వరకు కోత విధిస్తూ ప్రభుత్వ మద్దతు ధ రకు మంగళం పాడుతున్న సందర్భంలో కూడా సీసీఐ రంగంలోకి దిగకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. లక్సెట్టిపేట మార్కెట్‌లో రైతులకు గరిష్టంగా క్వింటాల్‌కు రూ.3,800 దక్కడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన పత్తి వ్యాపారుల ‘సిండికేట్’ దోపిడీకి రైతులు ఎన్ని రూ.లక్షలు నష్టపోయారో అంచనా వేయవచ్చు. అధికార యంత్రాంగం పత్తి మార్కెట్లలో ధరల వ్యత్యాసాలను నిరోధించి సిండికేట్ దోపిడీకి కళ్లెం వేయాలని కోరుతున్నారు.
‘తెల్ల’బోయే
Published Wed, Nov 20 2013 4:21 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement