సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని కడప, బయ్యారంలలో స్టీల్ ప్లాంట్ల నిర్మాణం సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫడవిట్ దాఖలు చేయడంపై ఉభయ తెలుగురాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా కడప, బయ్యారంలలో స్టీల్ ప్లాంట్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్టీల్ ప్లాంట్ల నిర్మాణంపై 2016లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులను టాస్క్ ఫోర్స్‌గా నియమించారు.
ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పలుమార్లు సమావేశం అయింది. ఈ నెల 12 తేదీన కూడా మరోసారి సమావేశం జరిగింది. స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుపై మెకాన్‌తో కలిసి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఫిజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయాలని కోరినట్లు ఉక్కు మంత్రిత్వ శాఖ వివరించింది. ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్థిక సమస్యలను చక్కదిద్దేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment