'రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోయింది' | Centre will stop Telangana formation process, says state ministers | Sakshi
Sakshi News home page

'రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోయింది'

Published Wed, Sep 25 2013 2:36 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Centre will stop Telangana formation process, says state ministers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోయిందని మంత్రులు గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్ స్పష్టం చేశారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో వారిరువురు భేటీ అయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుపై వర్కింగ్ కమిటీ తీర్మానం చేసి 56 రోజులు అయింది, అయిన తెలంగాణ ప్రక్రియ ముందుకు వెళ్లకపోవడమే అందుకు నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. వచ్చే నెల మొదటివారంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు వివరించారు. ఆ సమయంఓ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొంటామని గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement