కొరియర్ బాయ్‌గా ఇంట్లోకి వచ్చిన దుండగుడు వృద్ధురాలి మెడలో 3 కాసుల బంగారు గొలుసును లాక్కెళ్లాడు.
ఏలూరు (పశ్చిమగోదావరి జిల్లా) : కొరియర్ బాయ్‌గా ఇంట్లోకి వచ్చిన దుండగుడు వృద్ధురాలి మెడలో 3 కాసుల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని గో సంరక్షణశాల సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.
ఆ సమయంలో ఇంట్లో కూరపాటి అనసూయ(80) అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంది. కుటుంబ సభ్యులందరూ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.