ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాత్కాలిక రాజధాని హైదరాబాద్లో సచివాలయం ఛాంబర్ అక్టోబర్ ఒకటో తేదీ నాటికి సిద్ధం కానుంది. దీంతో అక్టోబర్ మొదటి వారం నుంచి సచివాలయంలోనే చంద్రబాబు తన విధులు నిర్వర్తిస్తారు. ఈ విషయాన్ని ఏపీ సచివాలయ వర్గాలు నిర్ధారించాయి.
మరోవైపు.. అఖిల భారత అధికారుల విభజనకు సంబంధించి తుది జాబితాను ఖరారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సెప్టెంబర్ రెండో తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యూష్ సిన్హా కమిటీతో భేటీ అయిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులలో ఎవరెవరు ఏయే రాష్ట్రాలకు వెళ్లాలో తుది జాబితాను రూపొందిస్తారు. ఆ జాబితాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆమోదానికి పంపి, ఆ తర్వాత అధికారులను విభజిస్తారు.
బాబు ఛాంబర్.. అక్టోబర్ 1కి సిద్ధం
Published Sat, Aug 30 2014 2:19 PM | Last Updated on Sat, Jul 28 2018 6:40 PM
Advertisement
Advertisement