హైదరాబాద్: ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 12న ఉదయం 10 గంటలకు సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతుంది. రాజధాని నిర్మాణం, రాష్ట్రావతరణ వేడుకలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పోస్టుల భర్తీపై కూడా ఇందులో చర్చించే అవకాశం ఉంది.
12 లేదా 13న మహానాడుపై చర్చ
ఈ నెల 27 నుంచి 29 వరకు తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న మహానాడుపై 12 లేదా 13న పార్టీ ఆంధ్ర, తెలంగాణ ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం త్వరగా ముగిసిన పక్షంలో అదే రోజున లేదంటే మరుసటి రోజు 13న సమావేశం జరుగుతుందని శనివారం పార్టీవర్గాలు తెలిపాయి.
12న ఏపీ మంత్రివర్గ భేటీ
Published Sun, May 10 2015 1:51 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement
Advertisement