
సచివాలయంలోకి వెళ్లిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోకి అడుగుపెట్టారు. 8వ అంతస్తులో ఉన్న ఎల్ బ్లాకులోని తన ఛాంబర్ లోకి ఆయన విజయదశమి రోజును ముహూర్తంగా ఎంచుకుని వెళ్లారు.
ఈ ఛాంబర్ కోసం పలుమార్లు మార్పులు, చేర్పులు జరిగిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు.