
జగన్‌ను చూసి బాబుకు వణుకు: జ్యోతుల
కాకినాడ: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రజాసమస్యలపై గళమెత్తుతున్న తీరును చూసి అధికార పక్షం వణికిపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ముఖ్యంగా జగన్ మాటల తూటాలకు సుదీర్ఘ రాజకీయ అనుభవం గల ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు.
శాసనసభలోని 175 మంది ఎమ్మెల్యేలకు సమాన న్యాయం చేయాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యవహార శైలి చూస్తుంటే.. ఆయన ఇంకా టీడీపీ వ్యక్తినే అన్న భావనలో ఉన్నట్టుందని జ్యోతుల విమర్శించారు. ఆయనను స్పీకర్ చేయడానికి చంద్రబాబు వారాల తరబడి ఊగిసలాడారన్నారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వ్యవహరించడం, ఆయనే సభలో అన్ పార్లమెంటరీ పదాలను వాడుతుండడం ఆక్షేపణీయమన్నారు. స్పీకర్ బుద్ధి మారాలని అన్నవరం సత్యదేవుని ప్రార్థించానన్నారు.