‘ఓటుకు కోట్లు’తో ఏపీ ప్రభుత్వానికేం సంబంధం? | 'crores to vote' With AP Govt Relationship? | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’తో ఏపీ ప్రభుత్వానికేం సంబంధం?

Published Tue, Jun 23 2015 2:04 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM

‘ఓటుకు కోట్లు’తో ఏపీ ప్రభుత్వానికేం సంబంధం? - Sakshi

‘ఓటుకు కోట్లు’తో ఏపీ ప్రభుత్వానికేం సంబంధం?

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో నారా చంద్రబాబు  తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక నీతిబాహ్యమైన చర్యలో ఇరుక్కుంటే దాన్నుంచి ఆయనను పరిరక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ప్రయత్నం చేస్తుందని వైఎస్సార్‌కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రశ్నించింది. పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేసుకీ, ఏపీ ప్రభుత్వానికీ సంబంధం ఏంటి?

ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కాపాడడానికా? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కాపాడడానికా? ప్రభుత్వ యం త్రాంగం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సీఎంపై కేసు రాలేదే’’ అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పక్క రాష్ట్రంలో చేసిన నీతి బాహ్యమైన చర్యపై కేసు, విచారణ జరుగుతున్నాయని చెప్పారు. పార్టీ అధ్యక్షుడుగా బాబు వ్యక్తిగతంగా నిజాయితీ నిరూపించుకోవాలని  డిమాండ్ చేశారు.

ఒక సాధారణ వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి మత్తయ్య కోసం గవర్నర్ వద్దకు రాష్ట్ర డీజీపీనే రిప్రజెంటేషన్ తీసుకెళ్లే పరిస్థితితో రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ దిగిజారిపోయిందన్న భావన ఏర్పడిందన్నారు. నోటీసులు అందుకున్న తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేకు ఏపీలో రహస్యంగా వైద్య పరీక్షలు చేయించే పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయని ప్రశ్నించారు.
 
రాష్ట్రంలో 15 రోజులుగా పరిపాలనే స్తంభించి పోయిందని.. ప్రభుత్వం చేయాల్సిన పనిచేయకుండా చంద్రబాబు అనే అవినీతిపరుడ్ని, నీతిబాహ్యమైన చర్యకు పాల్పడిన వ్యక్తిని పరిరక్షించడానికే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని ఆరోపించారు. డీజీపీ, సీఎస్‌లు దీనిపై యోచించాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement