సాక్షి, కాకినాడ: రెండు లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలోకి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడికి మళ్లీ అధికారం ఇవ్వమని అడిగే నైతిక హక్కులేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆయన ఆరోపించారు. లోకేష్‌కి మంత్రి పదవి ఇచ్చాకే అవినీతి తారాస్థాయికి పెరిగిందన్నారు. అవినీతికి డైరెక్షన్ ఇచ్చే కళాకారుడు లోకేష్ అని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను తీవ్రంగా విమర్శించారు.
ఓ బలమైన సామాజిక వర్గానికి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్‌ను బీజేపీ అహ్వానించిందని గుర్తుచేశారు. సామాజికమైన స్థితిగతులను మార్చలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అందుకే ఆయన కేవలం ఓ వ్యక్తిగా, ప్రశ్నగా మిగిలిపోయారని వీర్రాజు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమం అంటూ హీరో శివాజీ, చలసానిని చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చారని వెల్లడించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు బొక్కబోర్లా పడ్డరని, ప్రస్తుతం ఆయన పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment