
ఇల్లు మారనున్న చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కొత్త ఇంటికి మారనున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి లేక్వ్యూ గెస్ట్హౌస్ లేదా శేరిలింగంపల్లి మదినాగూడలోని ఫాంహౌస్ మారనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేసి... ఆ స్థానంలో కొత్త భవన నిర్మాణం డిసెంబర్లో చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబసభ్యులు ఆదివారం లేక్వ్యూ గెస్ట్హౌస్ను సందర్శించనున్నారు. కుటుంబ సభ్యులకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నచ్చని పక్షంలో మదినాగూడలోని ఫాంహౌస్నే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.