'బీజేపీతో పొత్తుపై బాబుకే స్పష్టత లేదు' | Chandrababu Naidu no clarity on BJP-TDP alliance, says Balineni Srinivasa Reddy | Sakshi
Sakshi News home page

'బీజేపీతో పొత్తుపై బాబుకే స్పష్టత లేదు'

Published Thu, Apr 17 2014 3:52 PM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM

'బీజేపీతో పొత్తుపై బాబుకే స్పష్టత లేదు' - Sakshi

'బీజేపీతో పొత్తుపై బాబుకే స్పష్టత లేదు'

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి స్సష్టం చేశారు. గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారో ఇంకా చెప్పలేదని అయితే రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే పార్టీకే కేంద్రంలో తమ పార్టీ మద్దతుంటుందని ఆయన పేర్కొన్నారు.

 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మతి భ్రమించిందని ఆరోపించారు. బీజేపీతో టీడీపీ పొత్తుపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇప్పటికీ స్పష్టత లేదని బాలినేని శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement