కేసీఆర్కు ఎప్పుడైనా ఆ ఆలోచన వచ్చిందా?
హైదరాబాద్: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అన్ని సమస్యలకు కాంగ్రెస్ కారణమని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేసిందన్నారు. టీడీపీని దెబ్బ తీసేందుకు తెలుగు జాతి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కేసీఆర్కు ఎప్పుడైనా వచ్చిందా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో టీఆర్ఎస్, విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో వెనుకబడిన వర్గాలు టీడీపీకి అండగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు.