
కృష్టానది ఇరువైపులా రాజధాని నిర్మించాలని...
హైదరాబాద్: కృష్ణానదికి ఇరువైపులా రాజధానిని నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... కృష్ణాజిల్లాలోని రైతులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య 50 వేల ఎకరాల స్థలం వివాదంలో ఉందని చెప్పారు.
ఏపీలోని మొత్తం 13 జిల్లాలోని భూమి లభ్యతపై సమగ్ర సర్వే జరుగుతుందని గద్దె రామ్మోహన్ రావు వెల్లడించారు. ఏపీ కొత్త రాజధాని విజయవాడలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే.