Gadde Rammohan Rao
-
‘తూర్పు’లో అల్లర్లకు టీడీపీ కుట్ర
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ ‘తూర్పు’ ఇన్చార్జి అవినాష్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లకు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ప్రత్యక్షమై సత్వరమే పరిష్కరిస్తూ ప్రజల మన్ననలను అవినాష్ పొందుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో అవినాష్ గెలుపు తథ్యమని ఇప్పటికే ‘తూర్పు’ ప్రజలంతా అంటున్నారు. ఈ తరుణంలో.. టీడీపీ అభ్యర్థి గద్దె, ఆ పార్టీ నేతలు రోజూ పార్కుల్లో, అపార్ట్మెంట్లలో మీటింగ్‌లు పెడుతూ, అవినాష్‌కు సంబంధం లేని గొడవల గురించి చెబుతూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి గిమ్మిక్కులు చేశారని గద్దె రామ్మోహన్ వంచనల గురించి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఎదుటి వారిని రెచ్చగొట్టడం వారి నైజం ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను రెచ్చగొట్టడం, గొడవలు జరగకుండానే జరిగినట్లు, తమపై దాడి చేశారని యాగీ చేయడంలో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ సిద్ధహస్తులని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ● 1994 ఎన్నికల్లో గన్నవరంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సమయంలో సౌమ్యుడైన దాసరి బాలవర్థనరావు వర్గం ఎలాంటి దాడి చేయకుండానే, తమపై దాడి చేశారంటూ గద్దె నానాహంగామా సృష్టించారు. మమ్మల్ని తిరగనియ్యడం లేదంటూ నాడు గద్దె రామ్మోహన్ దొంగ ఏడుపులు ఏడ్చారు. ఆయన సతీమణి కూడా నియోజకవర్గంలో సానుభూతి పొందేలా డ్రామా ఆడి రక్తికట్టించారు. నియోజకవర్గం అంతా పుకార్లు పుట్టించి లాభ పడినట్లు నాటి ఘటనను ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ● 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన దేవినేని నెహ్రూ ఎన్నికల ముందు రోజు తన సన్నిహితుని ఇంటికి పనిపై వెళ్లి వస్తే, మా ఇంటిపైకి వచ్చారంటూ గద్దె రామ్మోహన్ నానాయాగీ చేసి, చొక్కాలు చించుకొని, తమపై దాడి చేశారంటూ దొంగ నాటకానికి తెరలేపారు. ఉదయాన్నే పోలింగ్ ఉండటంతో ఈ ఘటనే సాకుగా చూపుతూ ఓట్లు దండుకొనే యత్నం చేశారు. ఆ అల్లరి కారణంగానే నాడు స్వల్ప తేడాతో నెహ్రూ ఓటమి పాలయ్యారు. ఇలా ప్రజలను గద్దె వంచిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు అప్రమత్తం కావాలి పోలీసులు అప్రమత్తమై ‘తూర్పు’లో గద్దె రామ్మోహన్ కుట్రలను భగ్నం చేసి , ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాదు మంచి మనిషి అనే ముసుగులో ఆయన చేసే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అనేకం ఉన్నాయని, అవన్నీ బయట పెడితే, కృష్ణానదిలో తలలు ముంచుకు పోవాలని ఇటీవల దేవినేని అవినాష్ ఒక సభలో ఆరోపించిన విషయం తెలిసిందే. నోరు జారిన ‘గద్దె’ తనయుడు ఇటీవల నగరంలో ఒక వేడుక వద్ద యువత పార్టీ జరిగింది. ఆ పార్టీలో అమెరికా నుంచి వచ్చిన గద్దె తనయుడు పాల్గొన్నారు. ఆ సమయంలో పార్టీలో పాల్గొన్న కొందరు యువకులు ఈసారి అవినాష్ గెలుపు ఖాయంగా ఉంది, ఎవరు చూసినా ఆయనే అంటున్నారని చర్చ జరిగింది. ఆ సమయంలో అదేమి లేదు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ‘తూర్పు’లో అల్లర్లు జరుగుతాయి, దాంతో ఆయన ఇమేజ్ దెబ్బతిని మళ్లీ మా నాన్న గెలుపు తథ్యమని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇలా టీడీపీ వాళ్లే అల్లర్లు చేసి, ఆ నెపాన్ని వైఎస్సార్ సీపీపై వేసే కుట్రలు తూర్పులో జరుగుతున్నాయనే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. -
చంద్రబాబూ.. ఆ మోసాన్ని గుర్తు తెచ్చుకో: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: రాణిగారితోటలో నిన్నటి చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేతకు 200 మంది కార్యకర్తలు కూడా రాలేదని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గద్దె రామ్మోహన్, చంద్రబాబు అందరూ కట్టకట్టుకుని కృష్ణా నదిలో దూకాలంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘గత ఐదేళ్లలో కృష్ణలంక, రాణీగారి తోట ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. నిన్నటి సభ చూసైనా చంద్రబాబు ఈ ప్రాంతానికి చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకోవాలి. తూర్పు నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. సీఎం జగన్ ప్రభుత్వంలోనే రాణిగారితోట ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇంటింటికీ కుళాయిలు అందించాం. చంద్రబాబు మీటింగ్ పెట్టుకున్న సభకు ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాల్ మేం నిర్మించిందే. రిటైనింగ్ వాల్ నిర్మించింది కూడా సీఎం జగన్ ప్రభుత్వమే’’ అని దేవినేని అవినాష్ అన్నారు. చదవండి: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు ‘‘సైకిల్ పోవాలని.. చంద్రబాబే తన మనసులో మాట బయటపెట్టాడు. బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం మేం ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి ఆలోచన నీకెప్పుడైనా వచ్చిందా చంద్రబాబు. గద్దె రామ్మోహన్ రాసిచ్చిన పేపర్ చదివి మమ్మల్ని విమర్శించావ్. రాణిగారితోట ప్రాంతంలో ముస్లిం మహిళలను రెచ్చగొట్టింది గద్దె రామ్మోహన్. టీడీపీలో కొందరు నారా లోకేష్‌ను ఫాలో అవుతున్నారు. వార్డు మెంబర్‌గా గెలవలేని వాళ్లను పార్టీలో చేర్చుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు’’ అని అవినాష్ దుయ్యబట్టారు. -
టీడీపీ దుష్ట పన్నాగం.. సభలో అడుగడుగునా అడ్డంకులు
సాక్షి, అమరావతి: టీడీపీ సభ్యులు గురువారం శాసనసభలో దుష్టçపన్నాగానికి తెరతీశారు. ఆర్థికమంత్రి బుగ్గన గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఉపక్రమించగానే సభలోకి వచ్చిన టీడీపీ సభ్యులు నినాదాలు అరుపులతో బడ్జెట్ ప్రసంగం వినపడనీయకుండా గందరగోళం సృష్టించారు. టీడీపీ సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు పెద్దగా నినాదాలు చేస్తుంటే, మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు చిత్తు కాగితాల ముక్కలను స్పీకర్‌పైకి, గాలిలోకి విసిరారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా అడ్డుపడటం మంచిది కాదని, ఏమైనా అభ్యంతరాలుంటే బడ్జెట్ చర్చలో తెలపవచ్చని మంత్రులు, స్పీకర్ చెప్పినా వారు వెనక్కు తగ్గకపోగా మరింత రెచ్చిపోయారు. సీఎం జగన్ జోక్యం చేసుకుని టీడీపీ తీరును తప్పుబట్టారు. వార్షిక బడ్జెట్‌ను ప్రజలంతా ఆసక్తిగా చూస్తారని, అలాంటి బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. బడ్జెట్ ప్రసంగం ప్రజలకు వినపడకూడదనే కుతంత్రంతోనే వారు గందరగోళం సృష్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. సభ సజావుగా జరిగేలా, ప్రజలకు బడ్జెట్ ప్రసంగం వివరంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ..ప్రజల ఆకాంక్షలను అడ్డుకోవడం సరికాదని, ఇష్టం లేకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. టీడీపీ సభ్యుల తీరులో మార్పు లేనందున తప్పని పరిస్థితుల్లో కఠిన నిర్ణయం తీసుకుంటున్నానంటూ టీడీపీకి చెందిన 14 మంది సభ్యులను ఒకరోజు పాటు సమావేశాల నుంచి సస్పెండ్ చేశాకే, బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. సస్పెండ్ అయిన తర్వాత కూడా సభ్యులు వెళ్లకుండా గొడవ చేస్తుండటంతో మార్షల్స్ వారిని బయటకు పంపించారు. -
నమ్మించి నట్టేట ముంచారు.. టీడీపీ ఎమ్మెల్యేపై గుస్సా
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ తూర్పు నియోజకవర్గం కంచుకోట... ఇది నిన్నటి వరకు టీడీపీ మాట. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ అంచనాలు పటాపంచలయ్యాయి. 21 నెలల కిందట జరిగిన సాధారణ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ తల్లకిందులైంది. పూర్తిగా తిరగబడటంతో అన్ని స్థాయిల నాయకులకు కళ్లు బైర్లుకమ్మాయి. ఇదంతా ఒక ఎత్తయితే స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ తమను నమ్మించి మోసం చేశారని పోటీదారులు పలువురు వాపోతున్నారు. తాము పోటీ చేయలేమని, ఆర్థికంగా తమ పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పినా వినిపించుకోకుండా అన్నివిధాలా తాము సర్దుబాటు చేసేస్తామని చెప్పి పోటీలోకి దింపి ఆఖరుకు చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గద్దె రామ్మోహన్ గాని, ఇతర పార్టీ ముఖ్య నేతలు తమ వారి గెలుపు కోసం తాపత్రయ పడ్డారే తప్ప తక్కిన పేద సామాజికవర్గాల అభ్యర్థులను పట్టించుకోలేదంటూ చర్చించుకుంటున్నారు. ఎవరికి ఏయే విధంగా లాభనష్టాలు జరిగాయో అంచనాలు వేసుకుంటూ ఇప్పుడు తామేం చేయాలో చెప్పాలంటూ తమ సామాజిక వర్గాల నేతల సలహాల కోసం సంప్రదిస్తున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. బీసీ వర్గానికి చెందిన డాంగే కుమార్ భార్య గతంలో కౌన్సిల్ సభ్యురాలు. అదేవిధంగా మైనార్టీ వర్గానికి చెందిన నజీర్ హుస్సేన్ కూడా గత కౌన్సిల్లో ఉన్నారు. వారివురినీ పక్కన పెట్టి గద్దె తన సామాజిక వర్గం వారికే టిక్కెట్లు ఇచ్చుకుని గెలిపించుకున్నారని నగరంలోని బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన నేతలు తలపోసుకుంటున్నారు. పాత డివిజన్ల లోని కొన్ని ప్రాంతాలు అటు ఇటు మారినా తమ వారిని మాత్రం ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేసుకుని జాగ్రత్త పడ్డారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్‌కు ముందే గట్టు కింద ప్రాంతానికి చెందిన పోటీదారు, అనుచరులు తమను చిన్నచూపు చూస్తున్నారని బాహాటంగానే వ్యాఖ్యానించినట్లు టీడీపీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. ఎన్నికలకు రెండు రోజులు ముందు వరకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు లేదంటే ఎలాగని కొందరు నిలదీయ గా, పోగైన సొత్తును ఏం చేశారని సీనియర్లు ఆరా తీశారని సమాచారం. బొండాతో తొలి నుంచీ అంతే... కృష్ణలంక, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల్లో మధ్య నియోజకవర్గ ఇన్చార్జి బొండా ఉమామహేశ్వరరావు సామాజికవర్గానికి చెందిన వారి సంఖ్య కాస్త ఎక్కువ. బొండా, గద్దెల మధ్య ఎప్పుడూ పొసగదనేది పార్టీలో బహిరంగ రహస్యమే. అంతెందు కు తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా గెలుపొందిన ఏడుగురు ఎవరెవరో పరిశీలిస్తే నాయకు ల మనస్తత్వం తేటతెల్లం అవుతుందంటున్నారు. ♦4వ డివిజన్: ఈ డివిజన్ గతంలో రెండు, మూడు డివిజన్లలో ఉండేది. గత కౌన్సిల్లో ఈ ప్రాంతం నుంచి దేవినేని అపర్ణ కార్పొరేటర్‌గా కొనసాగారు. ప్రస్తుతం జాస్తి సాంబశివరావు గెలుపొందారు. ♦8వ డివిజన్: గతంలో ఇందులో 13వ డివిజన్లో కొంత మేర ఉండేది. ఈ డివిజన్లో 2014–19 వరకు జాస్తి సాంబశివరావు కార్పొరేటర్‌గా కొనసాగగా ప్రస్తుతం చెన్నుపాటి ఉషారాణి గెలిచారు. ♦9వ డివిజన్ : ఈ ప్రాంతం పూర్వం 13వ డివిజన్‌గా ఉండేది. ఇందులో గత కౌన్సిల్లో కార్పొ రేటర్‌గా చెన్నుపాటి గాంధీ వ్యవహరించగా తాజా ఎన్నికల్లో చెన్నుపాటి క్రాంతిశ్రీ గెలుపొందారు. ♦10వ డివిజన్: ఇది గతంలో 8, 9 డివిజన్లలో కొంత భాగంగా ఉండేది. ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా దేవినేని ఆపర్ణ కార్పొరేటర్‌గా గెలిచారు. ♦11వ డివిజన్: ఈ డివిజన్ గతంలో 9వ డివిజన్‌గా ఉండేది. కోనేరు శ్రీధర్ మేయర్‌గా ఈ డివిజన్ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కేశినేని శ్వేత కార్పొరేటర్‌గా గెలుపొందారు. ♦12వ డివిజన్ : ఈ డివిజన్ గతంలో 10వ డివిజన్‌గా ఉండేది. 2014–19 వరకు ఈ డివిజన్ మైనార్టీ వర్గానికి చెందిన నజీర్ హుస్సేన్ కార్పొరేటర్‌గా కొనసాగారు. సిట్టింగ్ అయిన నజీర్‌కు టిక్కెట్ ఇవ్వలేదు. ఇక్కడి నుంచి సాయిబాబుగెలుపొందారు. ♦13వ డివిజన్ : ఈ డివిజన్ గతంలో 11వ డివిజన్‌గా ఉండేది. 2014–17 వరకు బీసీ నాయకుడు వీరంకి డాంగే కుమార్ కార్పొరేటర్‌గా ఉన్నారు. 2016లో ఆకస్మిక మరణంతో ఆయన సతీమణి వీరంకి కృష్ణకుమారి ఉప ఎన్నికల్లో పోటీచేసి కార్పొరేటర్‌గా గెలిచారు. డాంగే కుటుంబాన్ని పక్కనపెట్టి ముమ్మినేనిని గెలిపించుకున్నారు. ♦15వ డివిజన్: ఈ డివిజన్ గతంలో 14వ డివిజన్‌గా ఉండేది. 2014–19 కౌన్సిల్లో ఉమ్మడిశెట్టి బహదూర్ (వైఎస్సార్ సీపీ ) కార్పొరేటర్‌గా ఉన్నా రు. 2021లో ఈ డివిజన్ 15గా మారింది. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి రత్నం రమేష్ సతీమణి రత్నం రజని పోటీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో రత్నం రజనీని విత్‌డ్రా చేయించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన బెల్లం దుర్గ డిప్యూటీ మేయర్ అయ్యారు. చదవండి: చంద్రబాబు – నారాయణపై విచారణకు బ్రేక్ 4 వారాలు ‘స్టే’ తిరుపతి ఫలితం అదిరిపోవాలి -
ఎమ్మెల్యే గద్దె స్వగ్రామంలో టీడీపీకి ఆశాభంగం
గన్నవరం(కృష్ణా జిల్లా): టీడీపీకి చెందిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు స్వగ్రామమైన మండలంలోని అల్లాపురంలో ఆ పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. ఆ గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి డొక్కు సాంబశివ వెంకన్నబాబు 1,119 ఓట్లు సాధించి స్వతంత్ర అభ్యర్థి వీరాకుమారిపై 836 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ మద్దతు ఇచ్చిన చిక్కవరపు నాగమణి 40 ఓట్లతో మూడో స్థానంలో నిలవడంతో పాటు డిపాజిట్‌ను కోల్పోయారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పుట్టి పెరిగిన అల్లాపురంలో టీడీపీ ఘోర ఓటమి చెందడం పట్ల ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: గెలుపును జీర్ణించుకోలేక టీడీపీ దాష్టీకం.. ‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం -
కష్టం వారిది... కలరింగ్ మాత్రం ...
విజయవాడ: అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రచార ఆర్భాటానికి తెర తీశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల కాకున్నా.. స్థానిక సంస్థలకు వచ్చే ప్రత్యేక నిధులతో చేపట్టే పనులను తామే చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. కార్పొరేటర్లు కాళ్లరిగేలా నగరపాలక సంస్థ చుట్టూ తిరిగి మంజూరు చేయించుకున్న పనులకు సైతం తామే కొబ్బరికాయ కొట్టాలంటూ ఇంజనీర్లకు హుకుం జారీ చేస్తున్నారు. తమ స్థాయిని మరచి వేల రూపాయలతో చేపట్టే పనులకు సైతం భూమిపూజలు చేస్తూ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో తమను ఉత్సవ విగ్రహాలుగా చూస్తున్నారని ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లలోనే కాదు.. స్వపక్షంలోనూ అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. చిన్న చిన్న పనులకు సైతం ఎమ్మెల్యే వచ్చేస్తుంటే డివిజన్ ప్రథమ పౌరునిగా ఇంకా తామెందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై 17, 18, 22, 4 డివిజన్ల కార్పొరేటర్లు కౌన్సిల్లో అభ్యంతరం లేవనెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అధికార పక్షానికి చెందినవారు సైతం వాస్తవమేనని పేర్కొనడం విశేషం. ఆయన తీరు స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను నిర్వీర్యం చేసేలా ఉందని పలువురు మండిపడుతున్నారు. ఇదే విషయమై కొందరు కార్పొరేటర్లు మేయర్ వద్ద వాపోగా, తన పరిస్థితీ అంతేనన్నట్లు ఆయన మాట్లాడటం కొసమెరుపు. మీ హామీలు ఏమయ్యాయి? *ఎన్నికల్లో గెలిస్తే కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మిస్తానన్నారు. ఆరు నెలల కిందట సర్వే అంటూ హడావుడి చేశారు. ఇప్పుడేమో నదుల సుందరీకరణ పేరుతో కరకట్ట వాసుల్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై మీరే మీ నోరు మెదపడం లేదు. * నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వాస్పత్రిలో తాగునీరు లేకున్నా పట్టించుకోరు. అక్కడ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ప్లాంట్లే ఆధారం. *సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌కు కేంద్రం నిధులిచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు తన వాటా విషయం తేల్చలేదు. దీనిపై మీరు స్పందించరేం? *పటమట, కరెన్సీనగర్, మొగల్రాజపురం కొండ ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీటినే తీసుకుంటున్నారు. మొగల్రాజపురానికి పైప్‌లైన్ వేసినా బూస్టర్‌తోనే సరఫరా చేస్తున్నారు. రిజర్వాయర్ ఎప్పుడు పూర్తవుతుంది? *బి-ఫారం పట్టాలున్న వారందరికీ ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. ఇప్పుడేమో వందగజాల లోపు ఉన్న కొండప్రాంతాల వారికే అంటున్నారు. మిగిలిన వారి పరిస్థితేమిటి? *ఎమ్మెల్యే దత్తత తీసుకున్న డివిజన్‌లోనే కలుషిత మంచినీరు తాగే పరిస్థితి ఉంది. అయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. *10 ఎంజీడీ వాటర్ ప్లాంట్ కుంగి పనిచేయడం లేదు. దాని స్థానంలో కొత్తది నిర్మాణం చేపట్టే ఊసే లేదు. *రామలింగేశ్వర నగర్లో ఎస్టీపీతో తలెత్తే దుష్ఫలితాలను అరికడతానన్నారు. ఇంతవరకూ ఆ చర్యలేమీ ప్రచారానికే పెద్దపీట... నిత్యం డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నట్లు ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే, ఆ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించిన సందర్భాలు లేవు. కానీ ఏ నిధుల నుంచి పనులు చేపట్టినా.. తనకు తెలియకుండా టెంకాయ కొట్టడానికి వీలు లేదని ఇంజనీరింగ్ అధికారులకు హుకుం జారీ చేయడంతో వారు ప్రతి చిన్నపనికి ఎమ్మెల్యేను పిలుస్తున్నారు. దీంతో కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము డివిజన్లోని సమస్యలను గుర్తించి కౌన్సిల్లో ఆమోదం అనంతరం నిధులు మంజూరు చేయిస్తుంటే.. వాటికి కూడా ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక పనులు ప్రారంభించేటప్పుడు కార్పొరేటర్లకు కాకుండా తన అనుచరులను తీసుకొచ్చి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. కార్పొరేటర్లను గౌరవిస్తున్నాం నియోజకవర్గ అభివృద్ధికి రూ.16 కోట్ల నిధులు తీసుకొచ్చా. ప్రతిరోజూ డివిజన్లో మూడు గంటలు పర్యటిస్తున్నా. ప్రజల సాధక బాధకాలు తెలుసుకుంటున్నా. అందుకే అభివృద్ధి పనులు నాకు చెప్పకుండా చేయొద్దని అధికారులకు సూచించా. ఎక్కడ ఏది అవసరమో తెలుసుకొని చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అభివృద్ధి పనులకు సంబంధించి మొదటి కొబ్బరికాయ కార్పొరేటర్‌తో కొట్టిస్తున్నా, చివరి కొబ్బరి కాయ నేను కొడుతున్నా. ఇందులో తప్పేంటి. ప్రొటోకాల్ ప్రకారం కార్పొరేటర్లందరినీ గౌరవిస్తున్నాం. - గద్దె రామ్మోహన్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్పొరేటర్లను డమ్మీ చేస్తున్నారు మా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో స్థానిక కార్పొరేటర్ని డమ్మీ చేస్తూ పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మేము గెలిచి ప్రయోజమేముంది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి పనికీ డివిజన్లో కార్పొరేటర్‌కి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా అలా జరగడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నారు. - పళ్లెం రవి, 22వ డివిజన్ కార్పొరేటర్ ఇంజనీర్లపై ఒత్తిడి చేస్తున్నారు మా డివిజన్లోని పార్కు రోడ్డు అభివృద్ధి కోసం కౌన్సిల్లో అనేక ప్రతిపాదనలు పెట్టించి పనులు ప్రారంభించాం. దీనికి తనను పిలవలేదని ఎమ్మెల్యే ఇంజనీర్లపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. మిడ్‌సిటీ రోడ్డు కూడా నేను లేఖ ఇవ్వడంతో మంజూరైంది. ఈ పనుల విషయంలోనూ అధికారులపై ఒత్తిడి చేశారు. తమకు తెలియకుండా ఏ పనీ ప్రారంభించవద్దని అధికారులపై ఒత్తిడి చేస్తే, డివిజన్లలో మేమున్నది ఎందుకు? - చోడిశెట్టి సుజాత, 17వ డివిజన్ కార్పొరేటర్ కార్పొరేటర్లను పట్టించుకోవట్లేదు డివిజన్లో శంకుస్థాపనల సమయంలో మాకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఎమ్మెల్యే వెంట వచ్చిన అనుచరులు మమ్మల్ని వెనక్కి నెట్టేసి వాళ్లే ముందుకు వెళ్లిపోతున్నారు. మేము ప్రజాప్రతినిధిగా రోడ్లు మంజూరు చేయిస్తుంటే, ఎమ్మెల్యే వచ్చి కొబ్బరి కాయలు కొడుతూ అన్నీ తామే చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. - దాసరి మల్లేశ్వరి, 4వ డివిజన్ కార్పొరేటర్ -
కృష్టానది ఇరువైపులా రాజధాని నిర్మించాలని...
హైదరాబాద్: కృష్ణానదికి ఇరువైపులా రాజధానిని నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... కృష్ణాజిల్లాలోని రైతులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య 50 వేల ఎకరాల స్థలం వివాదంలో ఉందని చెప్పారు. ఏపీలోని మొత్తం 13 జిల్లాలోని భూమి లభ్యతపై సమగ్ర సర్వే జరుగుతుందని గద్దె రామ్మోహన్ రావు వెల్లడించారు. ఏపీ కొత్త రాజధాని విజయవాడలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
విజయవాడ ఈస్ట్ కౌంటింగ్‌లో గందరగోళం
వైఎస్సార్ సీపీ ఏజెంట్ల ఆందోళన ఈవీఎంలో ఓట్లు తారుమారు ! గంటసేపు నిలిపివేత రీకౌంటింగ్ చేస్తామన్న ప్రకటనతో సాగిన కౌంటింగ్ పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాక్షి, విజయవాడ: విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలోని ఒక ఈవీఎంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్లు కాస్త ఇండిపెండెంట్ అభ్యర్థికి పోలైనట్లు ఈవీఎంలో కనిపించి ప్రధాన పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడనట్లు మిషన్ చూపడం వివాదానికి కారణమయ్యింది. శుక్రవారం కానూరులోని పీవీపీ సిద్ధార్థ కళాశాలలో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి రాధకృష్ణ, టీడీపీ నుంచి గద్దె రామ్మోహనరావు కాంగ్రెస్ నుంచి దేవినేని నెహ్రు బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఉద యం 8గంటలకు కౌంటింగ్ మెదలైంది. ఆరో రౌండ్లో మూడో నెంబరు టేబుల్లో ఉన్న ఈవిఎం పనితీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాణిగారితోటలోని 176 పోలింగ్ బూత్‌లో ఉన్న ఈవి ఎం లెక్కింపులో ఇబ్బంది తలెత్తింది. ఎనిమిదో నెంబరు స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వంగవీటి రాధకృష్ణకు సున్నా ఓట్లు వచ్చినట్లు రాధ తర్వాత స్థానంలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి 668 ఓట్లు వచ్చినట్లు మిషన్‌లో నమోదయాఇంది. వాస్తవానికి వంగవీటి రాధకృష్ణకు ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. దీంతో అక్కడ మెజార్టీ వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఎజెంట్లు ధీమాతో ఉన్నారు. అయితే లెక్కింపులో సున్నా రావటంతో ఏజెంట్లు అశ్చర్యానికి లోనై అక్కడి అధికారులను ప్రశ్నించగా వారేమి బదులివ్వకపోవటంతో ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తక్షణమే కౌంటింగ్ నిలిపివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి వివాదాన్ని తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. తర్వాత రిటర్నింగ్ అధికారి మళ్లీ 176 బూత్ ఓట్లను రీకౌంటింగ్ చేస్తామని ప్రకటించారు. అయితే వివాదం తలెత్తిన క్రమంలో సుమారు గంటసేపు కౌంటింగ్ ప్రకియ నిలిచిపోయింది. సిబ్బంది పోరపాటుతో... వాస్తవానికి ఈవిఎంలు తెచ్చిన సిబ్బంది చేసిన పోరపాటు వల్ల ఈవివాదం జరిగింది. కౌం టింగ్ కేంద్రంలో మూడో నెంబరు టేబుల్లో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు, 10 నెంబరు టేబుల్లో విజయవాడ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈక్రమంలో 10 నెంబరు టేబుల్లో లెక్కించాల్సిన పార్లమెంట్ ఈవిఎంను మూడో టేబుల్లో పెట్టి అసెంబ్లీ ఓటింగ్‌గా లెక్కించటంతో ఈసమస్య ఉత్పన్నం అయింది. పార్లమెంట్ ఈవిఎంలో 8 నెంబరు స్వతంత్ర అభ్యర్థి, అసెంబ్లీలో రాధా ఉన్నారు. దీంతో పార్లమెంట్ ఈవిఎంను అసెంబ్లీలో లెక్కించటంతో సున్నా ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహం అనంతరం సుమారు గంటసేపు కౌంటింగ్ ఆపివేసి సమస్య మూలాల్ని గుర్తించి తర్వాత ఏజెంట్ల అనుమతితో ఈవిఎంలు మార్చి లెక్కించగా 176 బూత్‌లో వంగవీటి రాధాకృష్ణకు 300 పైచిలుకు ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ సెంటర్‌కు కలెక్టర్, సీపీ వివాదం తలెత్తిందన్న సమాచారం తెలుసుకున్న కలెక్టర్ రఘునందన్‌రావు, విజయవాడ నగర కమిషనర్ బి. శ్రీనివాసులు ఈస్ట్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అక్కడి అధికారులు అప్పటికే సమస్యను సరిదిద్దారు. ఈక్రమంలో కౌంటింగ్ కేంద్రంలోని ఏజెంట్లతో అధికారులు మాట్లాడారు. దీంతో బందోబస్తు అక్కడ భారీగా పెంచారు. మరోవైపు 267 బూత్‌లు కావటంతో 37 రౌండ్లు ఏర్పాటు చేశారు. దీంతో కౌంటింగ్ అలస్యంగా సాగుతుంది. -
ఓటర్లను ప్రలోభ పెడుతున్న టీడీపీ
-
గద్దె రామ్మోహన్ ఇంట్లో భారీగా చీరలు స్వాధీనం
టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ నివాసంలో విజయవాడ నగర పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన నివాసంలో 3500 చీరలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చీరలు మహిళ ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. గద్దె రామ్మోహన్ ఇంట్లో ఓటర్లకు పంచేందుకు భారీగా వస్త్రాలు ఉన్నట్లు ఆగంతకుల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు మంగళవారం ఉదయం సదరు నేత ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. దాంతో పెద్ద ఎత్తున చీరలను స్వాధీనం చేసుకుని, పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే జగ్గయ్యపేట పట్టణంలో మఠం బజారులోని టీడీపీ నేత శ్రీరాం రాజగోపాల్ నివాసంలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సదరు నాయకుడి ఇంట్లో ఓటర్లను పంచేందుకు సిద్దంగా ఉంచిన క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.