'సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ఎండీగా ఉన్నారు'
హైదరాబాద్: ప్రపంచంలోని అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ కంపెనీగా ఉన్న మైక్రోసాఫ్ట్ కు ఎండీగా మన తెలుగువాడు ఉన్నాడని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎండీగా తెలుగువాడైన సత్య నాదెళ్ల ఉండడం మనకెంతో గర్వకారణమని ఆయన అన్నారు. అయితే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో వ్యవరిస్తుండగా ఎండీ అని చంద్రబాబు చెప్పడంతో సభలో ఉన్న వారంతా అవాక్కయ్యారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు సీఈవోనని చెప్పుకున్న చంద్రబాబు ఆ విషయంలోనే పొరబడడం గమనార్హం
గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఐటీకి తానెంతో ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. తనవల్లే తెలుగువారు ఐటీ రంగంలో దూసుకుపోతున్నారని చెప్పుకున్నారు. హైదరాబాద్ ను తాను అభివృద్ధి చేయడం వల్లే ఇప్పుడు అక్కడ పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోందని చెప్పారు. ఏపీలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు.