చంద్రబాబు, దేవినేని ఉమాకు రాజకీయ సమాధి తప్పదు | Chandrababu Naidu, Uma DEVINENI will to political grave | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, దేవినేని ఉమాకురాజకీయ సమాధి తప్పదు

Published Fri, Jun 19 2015 3:20 AM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM

చంద్రబాబు, దేవినేని ఉమాకు రాజకీయ సమాధి తప్పదు - Sakshi

చంద్రబాబు, దేవినేని ఉమాకు రాజకీయ సమాధి తప్పదు

వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్
సాక్షి, విజయవాడ :
ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ప్రజలు రాజకీయ సమాధి చేస్తారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ చెప్పారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో పూర్తి ఆధారాలతో చిక్కిన చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి , ప్రజల దృష్టి మరల్చడానికి   చంద్రబాబు, దేవినేని ఉమా టీడీపీ కార్యకర్తలను  రెచ్చగొడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ దిష్టిబొమ్మలను తగలబెట్టిస్తున్నారని మండిపడ్డారు.

అక్కడి పోలీసులు చంద్రబాబుపై సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు మొదలుకొని మహిళల వరకు అందరినీ మోసం చేసిన చంద్రబాబును, జిల్లావాసులను మోసం చేస్తున్న ఉమాను ప్రజలు రాజకీయ సమాధి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యకర్తలను రెచ్చగొట్టే మంత్రి ఉమాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌ను విమర్శించడం, దిష్టిబొమ్మలు దహనం చేయడం లాంటివి చేస్తే ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement