కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి
Published Sun, Jul 31 2016 8:13 PM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM
–మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
జైపూర్ : గ్రామాల్లో ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లాకు వచ్చిన ఆమెకు ఆదివారం జైపూర్, చెన్నూర్, మంచిర్యాల, మందమర్రితో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఇంద్రారెడ్డి మాట్లాడారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని కావున రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి బహుమతిగా అందించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినప్పటికీ అవి నెరవేర్చడంతో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పాలన కోరుకుంటున్నారని అన్నారు. కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి కట్టుగా పని చేసి పార్టీ బలోపేతానికి తమ వంతు కషి చేయాలని సూచించారు. ఇందారం క్రాస్‌రోడ్డు నుంచి చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ Sర్యాలీ తీశారు.
Advertisement
Advertisement