'ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబు' | Chandrababu Naidu with redwood smugglers | Sakshi
Sakshi News home page

'ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబు'

Published Sat, Jul 19 2014 4:12 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

'ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబు'

'ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబు'

హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్లతో కలిసి ఏపి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు దిగిన ఫొటోలను వైఎస్ఆర్ సిపి  ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఈరోజు మీడియా ముందు ప్రదర్శించారు. చంద్రబాబుకు దమ్మూధైర్యం ఉంటే ఎర్రచందనం అక్రమరవాణాపై సీబీఐ విచారణ జరిపంచాలని సవాల్ విసిరారు. సీబీఐ విచారణ మీ చేతులో పనే కదా, నిష్పాక్షికంగా విచారణ జరిపితే మీ నాయకుల బాగోతమంతా బట్టబయలవుతుందని ఆయన అన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోనే ఏపీని బందిపోట్ల రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. దుష్టరాజకీయాలు చేయడంలో చంద్రబాబు మహానటుడన్నారు. నీ తప్పులను ప్రశ్నిస్తే తమపై ఎదురుదాడా? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడికి పశువుల దొడ్డిలాంటి చోట గదిని కేటాయిస్తారా? అని అడిగారు.

 సచివాలయంలో హుండీ పెట్టిమరీ అడుక్కుంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. మీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.  ఎర్రచందనం అమ్మితే, హుండీలు పెట్టి అడుక్కుంటే ప్రజల కష్టాలు తీరుతాయా? అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement