
'మద్దతు తెలపాల్సింది పోయి విమర్శలా?'
హైదరాబాద్ : కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో ప్రజా ఉద్యమం నడుస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాల సంక్షేమం కోసమే విజయమ్మ సమర దీక్ష చేపట్టారని ఆమె తెలిపారు. విజయమ్మ దీక్షకు మద్దతు తెలపాల్సింది పోయి చంద్రబాబు నాయుడు విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలు ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని ఆమె వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు సౌకర్యాలపై యనమల రామకృష్ణుడు అవాకులు, చవాకులు మాని ఆధారాలుంటే బయటపెట్టాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. యనమల తన ఆరోపణలు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె సవాల్ చేశారు. లేకుంటే యనమల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.