చంద్రబాబు ఇలా.. చినబాబు అలా..
అమరావతి: జమిలి ఎన్నికలను స్వాగతిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ఒక దేశం-ఒక ఎన్నిక’ను స్వాగతిస్తున్నానని అన్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఎన్నికలు జరగడం సరికాదని అభిప్రాయపడ్డారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ పార్టీల ఆధితప్యం పెరుగుతుందన్న వాదనలో వాస్తవం లేదన్నారు. ప్రజలకు ఎవరు మంచిచేస్తే వారే గెలుస్తారని చెప్పారు. గతంలో తనను ఎవరూ ఓడించలేదని, ఏదో చేద్దామన్న తొందరలో కొన్ని తప్పిదాలు జరిగిపోయాయని చెప్పుకొచ్చారు.
కాగా, దేశంలో ఏక కాలంలో ఎన్నికలు సాధ్యంకావని చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ నిన్న వ్యాఖ్యానించారు. ఏడాది ముందు ఎన్నికలంటే ఏ రాష్ట్రం ఒప్పుకోదని, ఆరు నెలల ముందంటే ఒప్పుకునే అవకాశముందని అన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదన్నారు.