
కుప్పం (చిత్తూరు జిల్లా) : టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరఫున శుక్రవారం నామినేషన్ దాఖలవుతున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు తరఫున ప్రతిసారీ స్థానిక నాయకులే నామినేషన్ దాఖలు చేసేవారు.
గత రెండు దఫాలు మాత్రం ఆయన కుమారుడు లోకేశ్‌తో నామినేషన్ వేయించారు. ఈసారి చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి వేయనున్నట్లు స్థానిక నేతలు తెలిపారు.