సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృత్యర్థం ఏర్పాటు చేసిన వైఎస్ స్మృతి వనం ప్రాజెక్టు నిర్వహణ కమిటీని ప్రభుత్వం పునర్నియమించింది. ఈ కమిటీకి ఇప్పటిదాకా జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండేవారు. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ ఫీల్డ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీఎఫ్)ను చైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా కర్నూలు డివిజనల్ రెవెన్యూ అధికారి, రహదారులు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు(నంద్యాల), ఉద్యాన శాఖ ఉప సంచాలకుల స్థానంలో జీవ వైవిధ్య విభాగం అసిస్టెంట్ కన్సర్వేటర్, ఫ్లయింగ్ స్క్వాడ్ విభాగం డివిజనల్ ఫారెస్ట్ అధికారిని నియమించింది.