కన్నుల పండువగా కోదండరాముని రథోత్సవం | Chariot eyes Kothandaramar panduvaga | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా కోదండరాముని రథోత్సవం

Published Sat, Apr 5 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

కన్నుల పండువగా కోదండరాముని రథోత్సవం

కన్నుల పండువగా కోదండరాముని రథోత్సవం

తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతిలో కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదవ రోజైన శుక్రవారం రథోత్సవం క న్నుల పండువగా జరిగింది. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు సీతాల క్ష్మణ సమేత కోదండరాముల వారు రథాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను క నువిందు చేశారు. దీనికి ముందు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవమూర్తులకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై కొలుతీర్చారు.

డప్పుల వాయిద్యాలు, భజన బృం దాల కోలాటాల నడుమ స్వామి ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీరామ నామ స్మరణ చేస్తూ భ క్తితో రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. నాలుగు మాడ వీధుల్లో రథం తిరిగి యథాస్థానానికి చేరాక ప్రబంధ వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు.

సాయంత్రం 3 నుంచి 4.30 గంటల వరకు అర్చకులు రథమండ పం వద్ద తిరుమంజనం, ఆస్థానం ని ర్వహించారు. రాత్రి 8 నుంచి 10 గం టల వరకు రఘురాముడి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయంగార్, చిన్నజీయంగార్, టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, స్థానిక ఆలయాల డె ప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారు లు, భక్తులు పాల్గొన్నారు.
 
భక్తి భావం నింపిన  శ్రీరామపట్టాభిషేకం నాటకం
 
మహతి కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి ప్రదర్శించిన శ్రీరామపట్టాభిషేకం ప ద్యనాటకం భక్తి పారవశ్యంగా సాగిం ది. టీటీడీ హిందూ ధర్మప్రచార పరి షత్ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రం లో, శ్రీరామచంద్ర పుష్కరిణి కళా వేది కపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కడపకు చెందిన సవేరా ఆర్ట్స్ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన శ్రీరామపట్టాభిషేకం పద్యనాటకం భక్తులను రంజిం పజేసింది. అలాగే శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దనున్న కళా వేదికపై నెల్లూరుకు చెందిన పి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యం లో పార్వతీపరమేశ్వర నాట్యమండలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘రామాం జనేయ యుద్ధం’ నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.
 
నేడు చక్రస్నానం

 
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 10.40 గంటలకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందు కోసం ఉదయం 7.30 గంటలకు స్వామి వారు పల్లకీలో కపిలతీర్థానికి ఊరేగింపుగా బయలుదేరుతారు. చక్రస్నానం అనంతరం తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయానికి చేరుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement