శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మొదట శ్రీకాకుళం పట్టణంలో పర్యట ఉంటుందని ఆధికారులు, జిల్లాకు చెందిన నాయకులు భావించి పర్యటన తాత్కాలిక ప్రొగ్రాంను సిద్ధం చేశారు. మార్పుల అనంతరం నరసన్నపేట, ఎచ్చెర్లమండలాల్లో పర్యటిస్తారని తుదిషెడ్యూల్‌ను కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం వెల్లడించారు.
పర్యటన ఇలా...
శనివారం 9.50 గంటలకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌పై 10.30 గంటలకు నరసన్నపేట మండలం తామరాపల్లికి చేరుకుంటారు.
10.35 గంటలకు తామరాపల్లిలోని అటవీమొక్కల పెంపకం కేంద్రం వద్దకు చేరుకుంటారు. 11 గంటల వరకు మొక్కలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 11.05 గంటలకు నరసన్నపేటలోని ఇందిరానగర్‌కాలనీకి వస్తారు.
11.35 వరకు ఇందిరానగర్‌కాలనీలో స్మార్ట్‌వార్డుపై స్థానికులతో మాటామంతీ చేస్తారు.
11.40 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు.
1.40 వరకు అక్కడ స్టాల్స్ పరిశీలన, పథకాల పంపిణీ, బహిరంగ సమావేశం నిర్వహిస్తారు.
అక్కడి నుంచి జమ్ములో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకొని జమ్ములో మధ్యాహ్న భోజనం చేస్తారు.
2.10 గంటలకు జమ్ము నుంచి హెలికాఫ్టర్‌పై బయలుదేరి ఎచ్చెర్ల పోలీస్ మైదానానికి 2.25 గంటలకు చేరుకుంటారు.
అక్కడి నుంచి 2.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా చిలకపాలెం వద్ద ఉన్న శివానీ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంటారు.
2.30 గంటల నుంచి 4.20 గంటల వరకు యువతతో స్కిల్స్‌డెవలప్‌మెంట్‌పై చర్చిస్తారు.
అక్కడి నుంచి 4.25 గంటలకు పోలీస్ మైదానానికి చేరుకుని 4.30 గంటలకు హెలికాఫ్టర్‌పై విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం వెళ్తారు.
సీఎం పర్యటనలో మార్పు
Published Fri, Feb 13 2015 1:33 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement