
అప్పుడిచ్చిన రాజీనామాను ఆమోదించండి: చిరంజీవి
సాక్షి, న్యూఢిల్లీ: తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ అక్టోబర్ 4 వ తేదీన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు సమర్పించిన రాజీనామా లేఖను ఆమోదించాలని కోరుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన లేఖను హైదరాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయం మీడియాకు విడుదల చేసింది.
కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తెలంగాణ బిల్లులో సీమాంధ్ర ప్రజల ఆలోచనలు, వారి సమస్యలు ఏ మాత్రం పట్టించుకోకపోవడం మనస్సును గాయపరిచిందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రిపదవి బాధ్యతలు నిర్వహించడానికి మనస్సాక్షి అంగీకరించడం లేదని తెలిపారు.