చంద్రబాబుకు ఇక నిద్రలేని రాత్రులే: చిరంజీవి | Chiranjeevi takes on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఇక నిద్రలేని రాత్రులే: చిరంజీవి

Published Sun, Aug 31 2014 1:51 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

చంద్రబాబుకు ఇక నిద్రలేని రాత్రులే: చిరంజీవి - Sakshi

చంద్రబాబుకు ఇక నిద్రలేని రాత్రులే: చిరంజీవి

కాకినాడ :  ఎన్నికల నేపథ్యంలో ఆచరణ సాథ్యం కాని హామీలిచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఇక నుంచి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ... చంద్రబాబును  తనదైన శైలిలో విమర్శించారు.

రుణమాఫీ చేయకుంటే గత టీడీపీ పాలనలో జరిగిన రైతుల ఆత్మహత్యలు పునావృతమయ్యే అవకాశం ఉందని చంద్రబాబును హెచ్చరించారు. అందుకు టీడీపీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. వ్యవసాయ రుణాలంటూ వాటిని పంట రుణాలుగా మార్చారన్నారు. ఎన్నికల సమయంలో కాపు కులస్తులకు కొండంతా చెస్తానని హామీలు గుప్పించి... బడ్జెట్లో మాత్రం గోరంత కేటాయించారని చంద్రబాబును ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement