తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం శంఖవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అనపర్తి : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం శంఖవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.