
ప్రభుత్వ సందేశం ప్రజల్లోకి పంపండి: బాబు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సందేశం ప్రజల్లోకి పంపడానికి పుష్కరాలు గొప్ప వేదికని, దాన్ని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి సూచించారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పుష్కర స్నానానికి వచ్చిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను సీఎం బుధవారం ఓ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్కరాల ఏర్పాట్లను వివరించారు.