చెన్నూర్, న్యూస్‌లైన్ : రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మ య్య మండల స్థాయి అధికారులతో టె లికాన్ఫరెన్స్‌లో మాట్లాడి, నూతన ఐటీ ఆధారిత సేవల ను (ఐటీఈఎస్) సోమవారం నుంచి ప్రారంభించారు. స్థానిక తహశీల్దార్ కార్యాయలంలో సీఎంతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో అన్ని శా ఖల అధికారులు పాల్గొన్నారు.
తొలుత సీఎం చిత్తూరు జిల్లా కలిగిరి తహశీల్దార్‌తో మాట్లాడారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జనగామా ఆర్టీవోతో మాట్లాడారు. ప్రజా ఫిర్యాదులు విభాగానికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారా..? అని అడి గి తెలుసుకున్నారు. ఈ నూతన సాంకేతిక పరి జ్ఞానం రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాలు 1126 మం డలాలు 80 డివిజన్లలో అమలులోకి వచ్చిం దని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మండలాల తహశీల్దార్లతో మాట్లాడాల్సి ఉన్నా సమయభావంతో మాట్లాడలేకపోతున్నామన్నారు. గతంలో ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకునే వారని, కొత్త విధానంతో సీఎంతో సహా రాష్ట్ర స్థాయి అధికారులు సైతం ఈ విధానం ద్వారా మండల స్థాయి అధికారులతో మాట్లాడే అవకాశం ఏర్పడింది. ఎంపీడీవో వేముల మల్లేశం, కోటపల్లి తహశీల్దార్ ఆనంద్‌రావు, పీఆర్ ఏఈ భారత్, గృహ నిర్మా ణ శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఈజీ ఎస్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆందోళనలో అధికారులు
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం సమాచారాన్ని జిల్లా కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. విధు ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై సింహ స్వప్నంగా మారి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం నుంచి సైతం టెలీకాన్ఫరెన్స్ ప్రారంభం కావడంతో మండల స్థాయి అధికారులు ఆందోళన చెందుతున్నారు.
అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్
Published Tue, Dec 10 2013 5:20 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement