ITES
-
ఐటీ ఆదాయ వృద్ధిపై కరోనా పడగ
ముంబై: కరోనా వైరస్ సంక్షోభం ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపించనున్నట్టు రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి దశాబ్ద కనిష్ట స్థాయి 0–2 శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది. మార్జిన్లు తగ్గిపోయి లాభాలు ప్రభావితం కావచ్చని పేర్కొంది. కొత్త ఒప్పందాలను కంపెనీలు నష్టపోవచ్చని, దాంతో భవిష్యత్తు ఆదాయాలపై రాజీ పడక తప్పని పరిస్థితి ఎదురవుతుందని ఓ నివేదిక విడుదల చేసింది. విదేశీ క్లయింట్లు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రస్తుత ఒప్పందాలు కూడా కొన్ని రద్దయిపోవచ్చని పేర్కొంది. దేశీయ ఐటీ రంగం (ఐటీఈఎస్ కూడా కలుపుకుని) 40 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఆర్థిక వృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ‘‘సాధారణంగా నూతన ఒప్పందాలు మార్చి, మే నెలల మధ్యనే కుదురుతుంటాయి. కానీ, ఈ ఏడాది ప్రస్తుత సమయంలో చాలా క్లయింట్లు వ్యాపార పరంగా రిస్క్‌లను అధిగమించడంపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. దీంతో విచక్షణారహిత ఐటీ వినియోగాన్ని వాయిదా వేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పటికే ఉన్న ఒప్పందాలను కొనసాగించొచ్చు’’ అని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథ్ తెలిపారు. -
ఉద్యోగ నియామకాలు 27 శాతం జంప్..
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగ నియామకాలు మే నెలలో 27 శాతం మేర పెరిగాయి. ప్రధానంగా ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ రంగాల్లోని నియామకాల్లో మంచి జోరు కొనసాగింది. ఈ విషయాలు నౌకరి.కామ్ నివేదికలో వెల్లడయ్యాయి. ఈ ఏడాది మేలో నౌకరి జాబ్ స్పీక్ ఇండెక్స్ 1,993 వద్ద నిలిచింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే సూచీలో 27 శాతం మేర వృద్ధి నమోదయ్యింది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లోని నిపుణుల డిమాండ్ వరుసగా 33%, 49% మేర పెరిగింది. సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, అకౌంట్స్ నిపుణుల డిమాండ్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. నగరాల వారీగా ఉద్యోగ నియామకాలను పరిశీలిస్తే.. ఢిల్లీ-ఎన్సీఆర్లో 58% వృద్ధి నమోదయ్యింది. ముంబై, బెంగళూరులలో వరుసగా 41%, 35% మేర వృద్ధి జరిగింది. ఆశావహంగా కంపెనీలు! ప్రపంచంలోని ఇతర దేశాల కన్నా మన కంపెనీలే ఉద్యోగ నియామక ప్రక్రియపై ఎక్కువ ఆశావహంగా ఉన్నాయి. మన తర్వాతి స్థానంలో జపాన్ ఉంది. మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వే ప్రకారం.. సర్వేలో పాల్గొన్న 37 శాతం కంపెనీలు వచ్చే త్రైమాసిక పు నియామకాల్లో వృద్ధి నమోదవుతుందని అభిప్రాయపడ్డారు. ఒక శాతం కంపెనీలు నియామకాలు తగ్గుతాయని పేర్కొన్నాయి. -
ఉద్యోగాలు పెరుగుతున్నాయ్!
మార్చిలో 22% వృద్ధి: నౌకరీ.కామ్ న్యూఢిల్లీ: ఐటీ సాఫ్ట్వేర్, ఐటీఈఎస్, టెలికాం, బీమా రంగాల దన్నుతో ఈ మార్చిలో ఉద్యోగ నియామకాల్లో 22 శాతం వృద్ధి నమోదైనట్లు జాబ్ పోర్టల్ ‘నౌకరీ డాట్‌కామ్’ తెలియజేసింది. ఈ ధోరణి మున్ముందు కొనసాగుతుందని కూడా నౌకరీ పేర్కొంది. నౌకరీ జాబ్ స్పీక్ సూచీ... గతేడాదితో పోలిస్తే ఈ మార్చిలో 1968కి చేరి 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఈ వృద్ధి 18 శాతంగా ఉంది. ఈ ఏడాది ఉద్యోగార్థులకు మంచిరోజులు వచ్చినట్లే కనిపిస్తోందని ఈ సందర్భంగా నౌకరీ ప్రధాన సేల్స్ అధికారి వి.సురేశ్ చెప్పారు. గతేడాది మార్చితో పోలిస్తే ఈ మార్చిలో ఐటీ రంగంలో నిపుణులకు డిమాండ్ 25 శాతం పెరగ్గా... ఐటీఈఎస్‌లో ఇది 48 శాతంగా ఉందని, సేల్స్-బిజినెస్ డెవలప్మెంట్ నిపుణులకు కూడా డిమాండ్ బాగా పెరిగిందని ఆయన తెలియజేశారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే ఉద్యోగాల వృద్ధిలో 50 శాతంతో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవగా ముంబై(45 శాతం), చె న్నై(43) తరువాతి స్థానాల్లో నిలిచాయి. -
ఆన్లైన్ హైరింగ్‌లో 11 శాతం వృద్ధి
మాన్స్టర్.కామ్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆన్లైన్ హైరింగ్ పెరిగింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 11 శాతం వృద్ధి నమోదైందని జాబ్ పోర్టల్ మాన్స్టర్.కామ్ వెల్లడించింది. ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ 15 పాయింట్లు(11 శాతం) పెరిగింది. జనవరి నుంచి నియామకాల్లో హెచ్చుదల కనపడుతోందని వివరించింది. రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనడానికి ఏప్రిల్ నియామకాల సూచి(ఇండెక్స్) నిదర్శనమని మాన్స్టర్ ఇండియా ఎండీ సంజయ్ మోడి పేర్కొన్నారు. ఐటీ, ట్రావెల్/టూరిజం రంగాల్లో నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, సిమెంటు, నిర్మాణ రంగం, ఐరన్/స్టీలు రంగాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే సీనియర్ మేనేజ్మెంట్ పోస్టులకు డిమాండ్ 51 శాతం వృద్ధి కనబరిచింది. హైదరాబాద్‌లో 11 శాతం.. ఐటీ, ఐటీఈఎస్, టెలికం రంగంలో హైదరాబాదీయులకు ఎక్కువ అవకాశాలు వరిస్తున్నాయి. ఆన్లైన్ మార్కెటింగ్ పోర్టల్స్ నుంచి భాగ్యనగరంలో నియామకాలు పెరిగాయని హెచ్ఆర్ రంగ సంస్థ టీఎంఐ గ్రూప్ డీజీఎం అపర్ణ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆన్లైన్ నియామకాల్లో 50-60 శాతం ఈ పోర్టల్స్ నుంచే ఉంటాయని చెప్పారు. తయారీ, మౌలిక రంగంలో నియామకాల ఊసే లేదని చెప్పారు. కాగా, మాన్స్టర్ నియామక సూచి ప్రకారం గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది 13 నగరాలకుగాను 10 నగరాలు వృద్ధి కనబరిచాయి. అహ్మదాబాద్ అత్యధికంగా 26 శాతం, బెంగళూరు 22, పునే 15, ముంబై 14, హైదరాబాద్‌లో 11% హెచ్చుదల నమోదైంది. -
అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్
చెన్నూర్, న్యూస్‌లైన్ : రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మ య్య మండల స్థాయి అధికారులతో టె లికాన్ఫరెన్స్‌లో మాట్లాడి, నూతన ఐటీ ఆధారిత సేవల ను (ఐటీఈఎస్) సోమవారం నుంచి ప్రారంభించారు. స్థానిక తహశీల్దార్ కార్యాయలంలో సీఎంతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో అన్ని శా ఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత సీఎం చిత్తూరు జిల్లా కలిగిరి తహశీల్దార్‌తో మాట్లాడారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జనగామా ఆర్టీవోతో మాట్లాడారు. ప్రజా ఫిర్యాదులు విభాగానికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారా..? అని అడి గి తెలుసుకున్నారు. ఈ నూతన సాంకేతిక పరి జ్ఞానం రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాలు 1126 మం డలాలు 80 డివిజన్లలో అమలులోకి వచ్చిం దని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మండలాల తహశీల్దార్లతో మాట్లాడాల్సి ఉన్నా సమయభావంతో మాట్లాడలేకపోతున్నామన్నారు. గతంలో ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకునే వారని, కొత్త విధానంతో సీఎంతో సహా రాష్ట్ర స్థాయి అధికారులు సైతం ఈ విధానం ద్వారా మండల స్థాయి అధికారులతో మాట్లాడే అవకాశం ఏర్పడింది. ఎంపీడీవో వేముల మల్లేశం, కోటపల్లి తహశీల్దార్ ఆనంద్‌రావు, పీఆర్ ఏఈ భారత్, గృహ నిర్మా ణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఈజీ ఎస్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఆందోళనలో అధికారులు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం సమాచారాన్ని జిల్లా కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. విధు ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై సింహ స్వప్నంగా మారి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం నుంచి సైతం టెలీకాన్ఫరెన్స్ ప్రారంభం కావడంతో మండల స్థాయి అధికారులు ఆందోళన చెందుతున్నారు.