
సాక్షి, అమరావతి : ప్రభుత్వ పాఠశాలలో ‘నాడు-నేడు’ కింద చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. జూన్ కల్లా పనులు పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో ఫర్నిచర్, చాక్‌బోర్డ్స్ తదితర వాటికి దాదాపుగా టెండర్లు పూర్తయ్యాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. మిగిలిన ఒకటి రెండు అంశాలకు కూడా త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
72,596 గ్రీన్ చాక్ బోర్డ్స్ కోసం రివర్స్ టెండర్లలో రూ.5.07కోట్లు ఆదా అయినట్లు సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. రూ.79.84 కోట్లు టెండర్లలో ఎల్–1 కోట్‌చేస్తే.. రివర్స్ టెండర్లలో రూ. 74.77 కోట్లుగా ఖరారైందన్నారు. అలాగే 16,334 అల్మరాల కోసం రూ.19.58 కోట్లకు ఎల్–1 కోట్ చేస్తే, రివర్స్ టెండర్లలో రూ. 15.35కు ఖరారైందని, తద్వారా రూ. 4.23 కోట్లు ఆదా అయ్యిందని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment