అంబులెన్స్‌ వ్యవస్థకు జవజీవాలు | CM YS Jagan to launch new Ambulance vehicles on July 1 | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌ వ్యవస్థకు జవజీవాలు

Published Sun, Jun 28 2020 5:17 AM | Last Updated on Sun, Jun 28 2020 5:17 AM

CM YS Jagan to launch new Ambulance vehicles on July 1 - Sakshi

విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కళాశాల మైదానంలో సిద్ధంగా ఉన్న 104,108 కొత్త వాహనాలు

రాష్ట్రంలో అంబులెన్స్‌ వ్యవస్థ మళ్లీ ప్రాణం పోసుకుంది. 2010 తర్వాత 108, 104 వ్యవస్థలు ఎలా నీరుగారి పోయాయో అందరికీ తెలిసిందే. లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఈ అంబులెన్స్‌ వ్యవస్థను మళ్లీ బతికించాలన్న ఉద్దేశంతో సర్కారు నడుం బిగించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో కొత్త అంబులెన్స్‌లు రోడ్డెక్కనున్నాయి. వీటితో పాటు సంచార వైద్య శాలలుగా చెప్పుకునే 104 వాహనాలు పల్లెలకు సగర్వంగా తలెత్తుకుని వెళ్లనున్నాయి. ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ భరోసా ఇచ్చే 108 వాహనాలతో పాటు పల్లె ప్రజలకు వైద్యం అందించడానికి మండలానికొక 104 వాహనం వెళ్లనుంది. జూలై 1న ఈ కొత్త వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు, రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా చిన్నారుల కోసం నియోనేటల్‌ కేర్‌ అంబులెన్స్‌లు సైతం రోడ్డు మీదకు రానున్నాయి.
– సాక్షి, అమరావతి

ఎన్నెన్నో ప్రత్యేకతలు
పల్సాక్సీ మీటర్‌
ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ అంటే.. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిని చూడటంతో పాటు పల్స్‌ రేటు చూపిస్తాయి.

మల్టీపారా మానిటర్‌ 
ఈసీజీ స్థాయిని ఎప్పటికప్పుడు చూడటంతో పాటు ఉష్ణోగ్రతల స్థాయి, రక్తపోటు స్థాయిలను చూడొచ్చు.

ట్రాన్స్‌పోర్ట్‌ వెంటిలేటర్‌ 
కొత్త వాహనాల్లో ఆక్సిజన్‌తో కూడిన ట్రాన్స్‌ పోర్ట్‌ వెంటిలేటర్‌ ఉంటుంది. బాధితుల పరిస్థితి 
విషమంగా ఉండి, శ్వాస తీసుకోలేని సమయంలో అంబులెన్స్‌లో ఉన్న ట్రాన్స్‌పోర్ట్‌ వెంటిలేటర్‌ను ఉపయోగిస్తారు.

సక్షన్‌ ఆపరేటర్‌
ప్రమాదంలో గాయపడినప్పుడు ఊపిరితి త్తుల్లో నిమ్ము, లేదా రక్తం చేరినప్పుడు ఆ తేమను లాగేం దుకు ఈ సక్షన్‌ ఆపరేటర్‌ ఉపయోగపడుతుంది.

ఫోల్డబుల్‌ స్ట్రెచర్స్‌
గతంలో ఇవి లేవు. తాజాగా తెచ్చారు. స్ట్రెచర్‌ను పూర్తిగా మడత పెట్టి తీసుకెళ్లొచ్చు. ఇది చాలా సులభంగా ఉంటుంది.

సిరంజి పంపు
ప్రమాదం జరిగినప్పుడు బాధితుడికి ఐవీ ఫ్లూయిడ్స్‌ లేదా, ఇంజక్షన్లు ఎక్కించాల్సి వచ్చినప్పుడు టైమ్‌ను సెట్‌చేస్తే ఆ టైము ప్రకారం ఇది ఎక్కిస్తుంది.

104 వాహనాల్లో సేవలు ఇలా..
గతానికీ ఇప్పటికీ ఈ మొబైల్‌ మెడికల్‌ యూనిట్లను పూర్తి భిన్నంగా నిర్వ హించనున్నారు. ఇకపై ప్రతి పల్లెకూ నెలలో ఒకరోజు విధిగా వెళ్లాల్సిందే. మండలానికి ఒక 104 వాహనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ ఇది అందుబాటులో ఉంటుంది.
► ప్రతి 104 వాహనం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో అనుసంధానమై ఉంటుంది.
► ఆ పీహెచ్‌సీ పరిధిలోకి వాహనం వెళ్లినప్పుడు పీహెచ్‌సీ సిబ్బంది లేదా ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది కూడా విధిగా వాహనం వద్దకు రావాల్సిందే.
► వాహనంలో డాక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉంటారు. మొత్తం 9 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు. 20 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి.
► గతంలో 52 రకాల మందులు (అవి కూడా ఉండేవి కావు) ఉండగా ఇప్పుడా సంఖ్యను 74కు పెంచారు.
► మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక జబ్బులకు సంబంధించి ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్‌ చేస్తారు.
► ఒకే రోజు రెండు గ్రామాలకు వెళ్లాల్సినప్పుడు ఉదయం ఒక గ్రామానికి, సాయంత్రం మరో గ్రామానికి వాహనం వెళుతుంది.
► ప్రతి వాహనం విలేజి క్లినిక్‌కు కూడా అనుసంధానమై ఉంటుంది.
► గతంలో 104 వాహనాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 3 కిలోమీటర్లు ఆవల ఉన్న పల్లెలకు మాత్రమే వెళ్లేవి. చాలా చోట్ల నిర్వహణ సరిగా లేక నిర్ణయించిన మేరకు కూడా 
పల్లెలకు వెళ్లేవి కావు.

నియోనేటల్‌ అంబులెన్స్‌లు
► గతంలో ఎప్పుడూ ఇలాంటి అంబులె న్స్‌లు ఏ ప్రభుత్వమూ నిర్వహించ లేదు. దేశంలో కూడా ఒకటీ లేదా రెం డు రాష్ట్రాల్లో మాత్రమే కొన్ని అందుబా టులో ఉన్నాయి. ఏపీలో 26 నియోనే టల్‌ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.
► ఒక రోజు వయసున్న పిల్లల నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రమాదం జరిగితే ఈ అంబులెన్స్‌లు అత్యాధునిక వైద్య సౌకర్యాలతో కూడిన సేవలందిస్తాయి. 
► కొన్ని రకాల సౌకర్యాలు గతంలో ఉన్నా వాటిని నిర్వ హించక పోవడంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రికి చేరేలోపే ప్రాణాలు కోల్పోయేవారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement