చినబాబు వాకిట్లో పందెం కో‘ఢీ’ | Cock fights political on Nara Lokesh | Sakshi
Sakshi News home page

చినబాబు వాకిట్లో పందెం కో‘ఢీ’

Published Thu, Jan 8 2015 1:16 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

చినబాబు వాకిట్లో పందెం కో‘ఢీ’ - Sakshi

చినబాబు వాకిట్లో పందెం కో‘ఢీ’

     లోకేష్ ఎదుట టీడీపీ నేతల
     పంచాయితీ పోలీస్ పవర్‌పై
     ఫిర్యాదు సంక్రాంతిలోపే
     ఎస్పీ బదిలీ కోసం పట్టు

 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : సంక్రాంతి రోజులు దగ్గర పడే కొద్దీ కోడి పందాల రాజకీయం వేడెక్కుతోంది. సంప్రదాయాల ముసుగులో విష సంస్కృతికి బీజం వేస్తున్న కోడి పందాలకు అడ్డుకట్ట వేయాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై స్పం దించి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయ డం.. గోదావరి జిల్లాల సంప్రదాయాలకు ప్రతీక అయిన కోడి పందాలకు అనుమతివ్వాలంటూ సుప్రీం కోర్టులో నేతలు పిటిషన్ వేయడం వంటి
 
 పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో పందాలపై ఉత్కంఠ నెలకొంది. ఉన్నత న్యాయస్థానాల ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా పందాల రాయుళ్లు మాత్రం బరులు సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ నేతలపై భారం పెట్టి పండగకు ముందునుంచే జోరుగా పందాలు, వాటి మాటున జూదాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పందాలకు అనుమతుల భారాన్ని నెత్తికెత్తుకున్న టీడీపీ నాయకుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందాన తయారైంది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ జిల్లా పోలీసులు చూసీచూడనట్టు ఉంటే చాలని టీడీపీ నేతలు ఆశించారు. హైకోర్టు ఉత్తర్వులు, డీజీపీ ఆదేశాలను తాము తు.చ. తప్పకుండా పాటిస్తామని జిల్లా పోలీసు అధికారులు తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో జనవరి 1న జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టి పందాలకు అనధికారిక అనుమతులు సాధించాలని అధికార పార్టీ నేతలు భావించారు. కానీ హైకోర్టు ఆదేశాల నడుమ వివాదాస్పద పందెం కోళ్ల వ్యవహారంపై చంద్రబాబు జిల్లా పర్యటనలో ఆ ప్రస్తావన తేలేదు.
 
 సీఎం పర్యటనతో పందెం కోళ్లకు అనధికారిక అనుమతులు వచ్చేస్తాయని, పోలీసు అధికారులకు అక్షిం తలు పడతాయని ఆశించిన వారిని ఆ రోజు చంద్రబాబు తీరు నిరాశపరచింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో లాభం లేదనుకున్న జిల్లా టీడీపీ నేతలు తాజాగా ఆయన కుమారుడు లోకేష్ వద్దకు వెళ్లి పందెం కోళ్ల వ్యవహారంపై సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు రెండురోజుల క్రితమే లోకేష్‌ను కలిసి కోడి పందాలు జరగకుంటే జిల్లాలో తలెత్తుకోలేమని గోడు వెళ్లబోసుకున్నట్టు సమాచారం. జిల్లా ఎస్పీని బదిలీ చేయిస్తే కొంత ఉపశమనం కలుగుతుందని సదరు టీడీపీ నేతలు లోకేష్‌ను అభ్యర్థించినట్టు భోగట్టా. ప్రభుత్వ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం జోరుగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో జిల్లా టీడీపీ నేతల కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
 విజయవాడ డీసీపీగా ఎస్పీ బదిలీ?
 హైకోర్టు ఉత్తర్వులు, డీజీపీ ఆదేశాలను అమలు చేస్తూ ముక్కుసూటిగా వెళ్తున్న ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామ్‌రెడ్డిపై బదిలీ వేటు వేయూలని కొందరు టీడీపీ నేతల మంకుపట్టు పడుతున్న నేపథ్యంలో ఆయన్ను విజయవాడకు బదిలీ చేయొచ్చన్న ఊహా గానాలు వినిపిస్తున్నారుు. విజయవాడ ప్రస్తుత డీసీపీ ఇక్బాల్‌ను తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో ఆ స్థానానికి రఘురామ్‌రెడ్డిని బదిలీ చేయొ చ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా బుధవారం ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఆ తర్వాత ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయని, ఆ  క్రమంలోనే ఎస్పీని ఇక్కడి నుంచి పంపిం చాలని పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు హోంమంత్రి చినరాజప్పపై కూడా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే టీడీపీలోని మరో వర్గం, బీజేపీ నాయకత్వం మాత్రం నిజాయితీగా పనిచేస్తున్న ఎస్పీని ఇక్కడే కొనసాగించేందుకు అవసరమైతే సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. కేవలం కోడి పం దాల కోసం ఒక ఐపీఎస్‌పై చంద్రబాబు బదిలీ వేటు వేస్తారా లేక ఎస్పీకి వెన్నుదన్నుగా నిలిచి నిజాయితీగా ముందుకు వెళ్లమంటారా అన్నది ఒకటి రెండు రోజుల్లోనే తేలిపోనుంది.
 
 ‘కోట్లా’టపై ఉత్కంఠ  నేడు సుప్రీం కోర్టులో విచారణ
 భీమవరం :  కోడి పందాలపై తీవ్ర ఉత్కంఠ నెల కొంది. పందాల రాయుళ్లు పంతం నెగ్గించుకుం టారా లేక పోలీసులు పైచేయి సాధిస్తారా అన్నవిషయంపై జిల్లావ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కోడి పందాలకు అనుమతించాలంటూ జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్త, బీజేపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ జరుగనుంది. సుప్రీం కోర్టు నిర్ణయంపైనే పందాల రాయుళ్లతోపాటు నిర్వాహకులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను పందాలు జరుగుతాయంటూ పలుచోట్ల బరులు సిద్ధం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement