నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
Published Wed, Dec 11 2013 4:14 AM | Last Updated on Sat, Jun 2 2018 8:32 PM
కలెక్టరేట్,న్యూసలైన్ : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించాల్సిన సేవల్లో నిర్లక్ష్యం చేసిన వారిపై క ఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ప్రగ తి భవన్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, శిశువులకు అందించాల్సిన పౌష్టికాహారం ఇతర సదుపాయాలు సక్రమంగా అందడంలేనట్లు సమీక్ష ద్వారా తెలుస్తోందన్నారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించి, ఆరోగ్యకరమైన సమాజం నిర్మించడానికి , మాతా శిశుమరణాలు తగ్గించడానికి కృషిచేయాలని సూచించారు. బాధ్యతలు విస్మరించి లక్ష్యాలకు తగ్గట్టుగా పని చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జేసీ హర్షవర్ధన్, ఐసీడీఎస్ పీడీ రాములు తదితరులు పాల్గొన్నారు.
‘బంగారు తల్లుల’ను గుర్తించ ండి
బంగారుతల్లి పథకానికి అర్హత పొందే ప్రతిపాపను పుట్టిన క్షణంలోనే ఏఎన్‌ఎంలు ఏంపీఎలకు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఆడపిల్లల నమోదులో ఐసీడీఎస్-ఆరోగ్యశాఖాధికారుల మధ్య తేడాలున్నాయన్నారు. ప్రసవమైన ప్రతికేసును నమోదుచేయాలని, పాప పుట్టిన క్షణంలోనే ఏఎన్‌ఎంలకు మెసేజ్ పంపాలన్నారు. ఈ నివేదికలు నెలకోసారి కాకుండా ఏరోజుకు ఆరోజు పంపించాలని ఆదేశించారు. ఏఎన్‌ఎంలు సంబంధిత ప్రాథమిక కేంద్రాల పరిధిలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. బంగారుతల్లి పథకం ప్రారంభమైన మే ఒకటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 9వేల మంది పిల్లలు జన్మించారని తెలిపారు. ఆరోగ్య శాఖద్వారా 8,876 మంది పి ల్లలు నమోదైనట్లు చెప్పారు. ఇందులో 8,097 మంది బంగారుతల్లి పథకానికి అర్హత కలిగి ఉన్నారన్నారు. వీటిలో 6,457 మందిని రిజిస్టర్ చేశామన్నారు. మిగతావారి పేర్లను రిజిస్టర్ చేయాల్సి ఉందన్నారు. పీడీలు రాములు, వెంకటేశం, డీఎంహెచ్ ఓ గోవింద్‌వాగ్మారే, ఏఎన్‌ఎంలు, ఏపీఓలు,ఏపీఎంలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement