- వైఎస్సార్‌సీపీ ఏపీ రైతు పరిరక్షణ కమిటీ ముందు రైతుల స్పష్టీకరణ
సాక్షి, గుంటూరు: ‘‘ఎకరానికి రూ. లక్ష చందా మేమే ఇస్తాం. ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో రాజధానిని కట్టుకోండి. ఇక్కడి భూములు సర్కారు తీసుకుంటే కౌలు రైతులు, కూలీల భవిష్యత్తు ఏమిటి? రెండు నెలలుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రజలకు బీపీ డౌన్ అవుతుంది’’ అంటూ గుంటూరు జిల్లా నిడమర్రు, కురగల్లు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతుల మనోగతం తెలుసుకునేందుకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కన్వీనర్‌గా ఉన్న వైఎస్సార్‌సీపీ రైతు పరిరక్షణ కమిటీ గురువారం గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల్లో పర్యటించింది.