సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఖర్చుచేసే ప్రతిపైసా లెక్కకొస్తుందని కలెక్టర్ బీ.శ్రీధర్ స్పష్టం చేశారు. ఈ ఖర్చు ను లెక్కించేందుకు ప్రత్యేకంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎన్నికల వ్యయ పర్యవేక్షణపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకనుగుణంగా వ్యయ పరిశీ లన జరగాలని, ఇందుకోసం ఏర్పాటుచేసిన బృందాలు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. రవాణా ఖర్చు రూ.50వేలు మించిన అభ్యర్థులు తప్పనిసరిగా లిఖితపూర్వక డాక్యుమెంట్లు సమర్పించాలని, లేకుంటే డబ్బును సీజ్‌చేసి తగిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో అధిక ఖర్చును నియత్రించాలన్న ఎన్నికల కమిషన్ నిబంధనలపై ప్రజలు స్పందించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి, డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.