ఏలూరులో తోపులాట మధ్య నిర్వాసితులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న మంత్రులు
పశ్చిమగోదావరి, ఏలూరు (సెంట్రల్): స్థానిక కస్తూరిబా నగరపాలకసంస్థ పాఠశాలలో ఏర్పాటు చేసిన నిర్వాసితుల శిబిరంలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. శిబిరం వద్ద నిర్వాసితులకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర పౌరసరఫరాశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ హాజరయ్యారు. కేంద్రంలో సుమారు 1,000 మందికి పైగా ఆశ్రయం పొందుతుంటే 100 దుప్పట్లను మాత్రమే పంపిణీ చేసేందుకు తీసుకురావడంతో నిర్వాసితుల మ«ధ్య తోపులాట జరిగింది. తోపులాటను అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. అనంతరం నిర్వాసితులను వారి గదుల్లోకి తరలించడంతో పరిస్థితి సర్దుమణిగింది. నిర్వాసితులు ఎక్కువ మంది ఉన్నా తక్కువ దుప్పట్లు తీసుకువచ్చి హడావుడి చేశారంటూ బాధితులు ప్రజాప్రతినిధుల తీరుపై మం డిపడ్డారు. ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, చింతమనేని ప్రభాకర్, ఎంపీ తోట సీతారామలక్ష్మీ, కో–ఆప్షన్ సభ్యుడు ఎస్‌ఎంఆర్ పెదబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment