
విలీనంపై కాంగ్రెస్ విషప్రచారం: ఈటెల
టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీన విషయమై ఆ పార్టీ విషప్రచారం చేస్తోందని టిఆర్ఎస్ నేత ఈటెల రాజేంద్ర అన్నారు.
మెదక్: టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీన విషయమై ఆ పార్టీ విషప్రచారం చేస్తోందని టిఆర్ఎస్ నేత ఈటెల రాజేంద్ర అన్నారు. విలీనంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్లమెంటులో తెలంణా బిల్లు పెట్టిన తరువాతే పార్టీ విలీనం విషయం ఆలోచిస్తామని కెసిఆర్ ఎప్పుడో చెప్పారన్నారు.
తెలంగాణ పునఃనిర్మాణంలో టిఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని ఈటెల చెప్పారు. తమకు 1956 నాటి తెలంగాణ కావాలని అన్నారు. తెలంగాణవాదులు, విద్యార్థులు మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు.