TRS Merger
-
విలీనంపై 1న టీఆర్ఎస్ కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేయడమా.. లేక ఆ పార్టీతో రాబోయే ఎన్నికలలో పొత్తు పెట్టుకోవాలా అన్న విషయాన్ని నిర్ణయించేందుకు టీఆర్ఎస్ కీలక సమావేశం మార్చి 1న జరగనుంది. ఆరోజు పొలిట్ బ్యూరో, పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం కలిసి మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం అవుతాయని ఆ పార్టీ తెలిపింది. విభజన నేపథ్యంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆ సమావేశంలో కూలంకషంగా చర్చిస్తారు. కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనం గురించి కేసీఆర్ సంకేతాలు ఇచ్చారని, అయితే ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ బుధవారమే చెప్పారు. అయితే.. టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇప్పటికీ ఈ అంశంపై మౌనాన్నే పాటిస్తున్నారు. పొత్తు మాత్రమే ఉంటుంది తప్ప విలీనం జరగకపోవచ్చని కొందరు అంతర్గత సంభాషణలలో చెబుతున్నారు. ఏ విషయమూ శనివారం తేలిపోతుందన్న మాట!! -
టీఆర్ఎస్కు అభ్యర్థులు కూడా లేరు: అరవింద్ రెడ్డి
కేసీఆర్ బేషరతుగా తన పార్టీ టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తన మాట నిలబెట్టుకోవాలని ఆ పార్టీ మాజీ సభ్యుడు, ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం టీఆర్ఎస్కు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్... మరి సోనియా, రాహుల్ గాంధీల వద్దకు ఒక్క దళితుడిని కూడా ఎందుకు తీసుకెళ్లలేదని ఆయన నిలదీశారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తాడని, తెలంగాణలోని 84 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీఆర్ఎస్కు సరైన అభ్యర్థులు కూడా లేరని ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి విమర్శించారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం వల్లే కాంగ్రెస్‌లో చేరానని ఆయన చెప్పారు. -
విలీనంపై కేసీఆర్ సంకేతాలిచ్చారు
-
విలీనంపై కేసీఆర్ సంకేతాలిచ్చారు: దిగ్విజయ్
కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం ఉండొచ్చనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకేతాలిచ్చినట్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని, ఈ సందర్భంగా అలాంటి సంకేతాలు ఇచ్చారని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీతో భేటీ అయిన అనంతరం ఆ వివరాలను దిగ్విజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఉన్నా.. పన్ను రాయితీలు మాత్రం పదేళ్ల పాటు కొనసాగుతాయని, పోలవరం ప్రాజెక్టు తప్పనిసరిగా వచ్చి తీరుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లులో సీమాంధ్రకు అనుకూలంగా ఉన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోనియా సూచించారని, సీమాంధ్రకు కేజీ బేసిన్ గ్యాస్ కేటాయింపుపై దృష్టి పెట్టారని, సోనియాతో అనేక అంశాలపై నాయకులు చర్చించారని అన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక పార్టీ కమిటీ, ప్రత్యేక ఎన్నికల కమిటీ, ప్రత్యేక మేనిఫెస్టో కమిటీ కొన్నిరోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాయలసీమ, కోస్తాంధ్రలో మార్చి నెలాఖరులో బహిరంగ సభలుంటాయని, వాటికి సోనియా, రాహుల్, మన్మోహన్‌లను నాయకులు ఆహ్వానించారని కూడా దిగ్విజయ్ చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించిందని, దేశంలోనే అగ్రస్థాయి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాలు కూడా మళ్లీ అగ్రస్థానం కోసం పోటీ పడతాయని తాను ఆశిస్తున్నానన్నారు. ఈ రెండు రాష్ట్రాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ పడతాయని, పరస్పరం సహకరించుకుంటాయని ఆయన అన్నారు. సీమాంధ్రకు ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇచ్చామని, అయితే పన్ను రాయితీలు మాత్రం పదేళ్ల పాటు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రత్యేక హోదా కింద 90శాతం వరకు కేంద్ర గ్రాంటులు అందుతాయన్నారు. కొత్త రాజధాని ఎక్కడుండాలి, అలాగే కొత్త హైకోర్టు ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశాలను నిపుణుల కమిటీ చూసుకుంటుందని తెలిపారు. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర, అపాయింటెడ్ డే కోసం తాము ఎదురు చూస్తున్నామని, అవి రాగానే కొత్త రాష్ట్రం ఏర్పాటవుతుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. -
కేసీఆర్ మాట నిలబెట్టుకుంటానన్నారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విశ్వసనీయతే ఆస్తి అని, కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం అంశంపై మాటమీద ఉంటామని కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారని ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. శనివారం రాత్రి ఆయన ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, సురేష్ షెట్కర్తో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా కాంగ్రెస్‌లో విలీనానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని సీడబ్ల్యూసీ తీర్మానం అనంతరం దిగ్విజయ్ చెప్పారు. దానికి కేసీఆర్ కూడా స్పందిస్తూ మాట మీద ఉంటామన్నారు. ఉద్యమకారుడిగా కేసీఆర్‌పై మాకు గౌరవం ఉంది’’ అని పొన్నం పేర్కొన్నారు. ‘‘సీమాంధ్రుల సమస్యల పరిష్కారంలో మేం భాగమవుతాం. అలాగే మా సమస్యల పరిష్కారంలో కూడా వారి మద్దతు కావాలి’’ అని ముగ్గురు ఎంపీలు పేర్కొన్నారు. కాగా, లగడపాటి వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా మచ్చ తెచ్చిందన్నారు. -
విలీనమో, పొత్తో కేసీఆరే చెప్పాలి: కోమటిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తానిచ్చిన మాటను ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నిలబెట్టుకున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తాము తెలంగాణను తీర్చిదిద్దుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ ఇస్తే తమ పార్టీని విలీనం చేస్తామని గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా చెప్పారని, ఇప్పుడు విలీనం ఉంటుందా.. లేక పొత్తు పెట్టుకుంటారా అనే విషయాన్ని ఆయనే చెప్పాలని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ద్వంద్వ వైఖరి అవలంబించారని ఆయన ధ్వజమెత్తారు. -
టీఆర్ఎస్ విలీనంపై కాంగ్రెస్ దృష్టి
11న ఢిల్లీకి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియపై వేగంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) విలీనంపైన కూడా దృష్టి సారించినట్టు చెబుతున్నారు. తెలంగాణ బిల్లుకు ఆమోదముద్ర పడితే పార్టీని విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక సందర్భాల్లో స్పష్టంచేశారు. అయితే టీఆర్ఎస్ను విలీనం చేసుకునే అంశంపై ఇప్పటివరకు ఇరు పార్టీల మధ్య ఎలాంటి సంప్రదింపులు, చర్చలు జరగలేదని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన అవగాహనతో ఉందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ విలీన అంశంపై కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే చర్చలు జరిపినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం విలీన ప్రణాళిక ఎప్పుడో సిద్ధం చేసినట్టు జీవోఎంలోని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులను మానసికంగా సమాయాత్తం చేయడానికే విలీన అంశం తెరపైకి తెస్తున్నారన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతలు చెబుతుండగా, అధికారికంగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 11వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 12న జీవోఎం ముందు హాజరై 10 జిల్లాలతో కూడిన తెలంగాణపై తన అభిప్రాయాన్ని వినిపిస్తారని తెలుస్తోంది. అయితే ఢిల్లీలో జరిగే పరిణామాల ఆధారంగా కేసీఆర్ ఏఐసీసీలోని ముఖ్యులతో చర్చలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు. -
బిల్లు తర్వాతే అడుగుతారేమో?
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతే కాంగ్రెస్ పెద్దలు టీఆర్ఎస్ విలీనం అంశంపై మాట్లాడతారేమోనని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడుతున్నారు. రెండు, మూడు రోజులుగా మెదక్ జిల్లాలోని ఫాంహౌజ్‌లో తనను కలిసిన సన్నిహితులతో కేసీఆర్ చెబుతున్న అంశాల ప్రకారం.. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం అంశంపై ఇప్పటికీ స్పష్టత లేనట్లుగా చెబుతున్నారు. అసలు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కేసీఆర్‌తో మాట్లాడలేదని అంటున్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి పేచీ, కిరికిరి లేకుండా తెలంగాణ ఇస్తే విలీనం చేయడానికి సిద్ధమేనని గతంలోనే మాట ఇచ్చామని వారు గుర్తుచేస్తున్నారు. ‘‘ఇప్పటికే ఇలాంటి చర్చలు చాలా జరిగాయి. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే తప్ప కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు. అందుకే ముందుగా ఎలాంటి చర్చలకూ తావివ్వకుండా, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే వారు మాట్లాడే అవకాశముంది. అప్పటిదాకా విలీనంపై ఎవరైనా, ఏమైనా ఎలా చెప్పగలం’’ అని కేసీఆర్ తన సన్నిహితుడితో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఒకవేళ హైదరాబాద్‌పై ఎలాంటి కిరికిరీ లేకుండా తెలంగాణ ఇస్తే పార్టీపై నైతిక ఒత్తిడి ఉంటుందని, దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సీట్లే ముఖ్యం. పొత్తు పెట్టుకుంటే పార్లమెంటు సీట్లు కాంగ్రెస్‌కు, అసెంబ్లీ సీట్లు ఎక్కువ భాగం టీఆర్ఎస్కు ఉండే అవకాశాలను కూడా కాదనలేం. విలీనం జరిగితే తెలంగాణలో మరోపార్టీ పెరిగే అవకాశముంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ మాత్రమే ఉండాలి. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేసి తెలంగాణలో మరో పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఇప్పుడైతే ఇలాంటి దిశలోనే చర్చలు జరుగుతున్నాయి’’ అని వారు పేర్కొంటున్నారు. -
విలీనంపై కాంగ్రెస్ విషప్రచారం: ఈటెల
మెదక్: టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీన విషయమై ఆ పార్టీ విషప్రచారం చేస్తోందని టిఆర్ఎస్ నేత ఈటెల రాజేంద్ర అన్నారు. విలీనంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్లమెంటులో తెలంణా బిల్లు పెట్టిన తరువాతే పార్టీ విలీనం విషయం ఆలోచిస్తామని కెసిఆర్ ఎప్పుడో చెప్పారన్నారు. తెలంగాణ పునఃనిర్మాణంలో టిఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని ఈటెల చెప్పారు. తమకు 1956 నాటి తెలంగాణ కావాలని అన్నారు. తెలంగాణవాదులు, విద్యార్థులు మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. -
విలీనంపై కాంగ్రెస్ విషప్రచారం: ఈటెల
మెదక్: టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీన విషయమై ఆ పార్టీ విషప్రచారం చేస్తోందని టిఆర్ఎస్ నేత ఈటెల రాజేంద్ర అన్నారు. విలీనంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్లమెంటులో తెలంణా బిల్లు పెట్టిన తరువాతే పార్టీ విలీనం విషయం ఆలోచిస్తామని కెసిఆర్ ఎప్పుడో చెప్పారన్నారు. తెలంగాణ పునఃనిర్మాణంలో టిఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని ఈటెల చెప్పారు. తమకు 1956 నాటి తెలంగాణ కావాలని అన్నారు. తెలంగాణవాదులు, విద్యార్థులు మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. -
విలీనంపై కాంగ్రెస్ విషప్రచారం: ఈటెల
మెదక్: టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీన విషయమై ఆ పార్టీ విషప్రచారం చేస్తోందని టిఆర్ఎస్ నేత ఈటెల రాజేంద్ర అన్నారు. విలీనంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్లమెంటులో తెలంణా బిల్లు పెట్టిన తరువాతే పార్టీ విలీనం విషయం ఆలోచిస్తామని కెసిఆర్ ఎప్పుడో చెప్పారన్నారు. తెలంగాణ పునఃనిర్మాణంలో టిఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని ఈటెల చెప్పారు. తమకు 1956 నాటి తెలంగాణ కావాలని అన్నారు. తెలంగాణవాదులు, విద్యార్థులు మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు.