టీఆర్ఎస్కు అభ్యర్థులు కూడా లేరు: అరవింద్ రెడ్డి | trs do not have candidates, says aravind reddy | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్కు అభ్యర్థులు కూడా లేరు: అరవింద్ రెడ్డి

Published Thu, Feb 27 2014 12:53 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

టీఆర్ఎస్కు అభ్యర్థులు కూడా లేరు: అరవింద్ రెడ్డి - Sakshi

టీఆర్ఎస్కు అభ్యర్థులు కూడా లేరు: అరవింద్ రెడ్డి

కేసీఆర్ బేషరతుగా తన పార్టీ టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తన మాట నిలబెట్టుకోవాలని ఆ పార్టీ మాజీ సభ్యుడు, ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం టీఆర్ఎస్కు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్‌... మరి సోనియా, రాహుల్‌ గాంధీల వద్దకు ఒక్క దళితుడిని కూడా ఎందుకు తీసుకెళ్లలేదని ఆయన నిలదీశారు.

కేసీఆర్‌ తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తాడని, తెలంగాణలోని 84 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీఆర్ఎస్కు సరైన అభ్యర్థులు కూడా లేరని ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి విమర్శించారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం వల్లే కాంగ్రెస్‌లో చేరానని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement