విలీనంపై 1న టీఆర్ఎస్ కీలక సమావేశం | TRS to decide over merger on March 1 | Sakshi
Sakshi News home page

విలీనంపై 1న టీఆర్ఎస్ కీలక సమావేశం

Published Thu, Feb 27 2014 1:20 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

విలీనంపై 1న టీఆర్ఎస్ కీలక సమావేశం - Sakshi

విలీనంపై 1న టీఆర్ఎస్ కీలక సమావేశం

తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేయడమా.. లేక ఆ పార్టీతో రాబోయే ఎన్నికలలో పొత్తు పెట్టుకోవాలా అన్న విషయాన్ని నిర్ణయించేందుకు టీఆర్ఎస్ కీలక సమావేశం మార్చి 1న జరగనుంది. ఆరోజు పొలిట్ బ్యూరో, పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం కలిసి మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం అవుతాయని ఆ పార్టీ తెలిపింది. విభజన నేపథ్యంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆ సమావేశంలో కూలంకషంగా చర్చిస్తారు.

కాంగ్రెస్లో తమ పార్టీ విలీనం గురించి కేసీఆర్ సంకేతాలు ఇచ్చారని, అయితే ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ బుధవారమే చెప్పారు. అయితే.. టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇప్పటికీ ఈ అంశంపై మౌనాన్నే పాటిస్తున్నారు. పొత్తు మాత్రమే ఉంటుంది తప్ప విలీనం జరగకపోవచ్చని కొందరు అంతర్గత సంభాషణలలో చెబుతున్నారు. ఏ విషయమూ శనివారం తేలిపోతుందన్న మాట!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement