Arvind Reddy
-
TS Election 2023: పార్టీ వీడుతారా..? పార్టీకి విధేయతను ప్రదర్శిస్తారా..?
మంచిర్యాల: గులాబీ గూటిలో అసంతృప్తి ‘ముళ్లు’ బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు దక్కడంతో పార్టీలో ఉన్న నాయకులు తమ పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు. గత రెండ్రోజులుగా మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలను కలుస్తున్నారు. ఆదివారం కూడా మంచిర్యాల పట్టణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తన అనచరులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా ఉన్నారు. గతంలో ఆయనకు ఎమ్మెల్సీ, రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించినా ఎలాంటి పదవీ రాలేదు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎవరికి ఆయన మద్దతు ఉంటుందనేది కీలకంగా మారనుంది. ఇటీవల నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహించి టికెట్ ఆశించిన రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంటు కార్పొరేషన్ చైర్మన్ పుస్కూరి రామ్మోహన్రావు ఒకింత నిరాశలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన వర్గం ఇప్పటికీ పార్టీలో ఎమ్మెల్యే గ్రూప్‌తో విభేదించి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా నాయకులు పార్టీ వీడుతారా..? లేక మళ్లీ పార్టీకి విధేయతను ప్రదర్శిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. -
‘అరవింద సమేత..’ దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఐఎంఎస్(ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్)లో రోజుకో సంచలనం వెలుగుచూస్తోంది. మాజీ డైరెక్టర్, మాజీ జాయింట్ డైరెక్టర్ పద్మ అక్రమాలు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నాయి. ఈఎస్‌ఐల మందుల కొనుగోళ్లలో ఇష్టానుసారంగా వ్యవహరించిన మాజీ జేడీ పద్మ మందుల కొనుగోళ్లు అధికరేట్లు, తప్పుడు ఇండెంట్లలో చేతివాటం చూపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈమెకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) దర్యాప్తులో బయటపడింది. అదనంగా వచ్చిన ఆర్డర్ల తాలూకు మందులను రహస్యంగా బయటకి పంపి, వాటినీ సొమ్ము చేసుకున్న విషయం ఏసీబీ గుర్తించింది. ఈ కుట్రలో ఆమెకు సహకరించిన ముగ్గురు సోమవారం అరెస్టయ్యారు. ఎలా చేసింది..? నిబంధనలకు విరుద్ధంగా, అవసరానికి మించి మందులు ప్రొక్యూర్ చేసిన పద్మ వాటిని అంతటితో ఆగలేదు. వాటిని వైద్యశిబిరాల పేరుతో రహస్యంగా బయటకి తరలించేది. తనకు పరిచయమున్న డాక్టర్ చెరకు అరవింద్‌రెడ్డి అనే వ్యక్తి ఈ వ్యవహారాన్ని ఎవరి కంటబడకుండా నడిపేవాడు. ఇతనికి వెంకటేశ్వర హెల్త్ సెంటర్ అనే మందుల కంపెనీ ఉంది. ఇతనికి బాలానగర్, సుచిత్రలలో మందుల గోదాములు ఉన్నాయి. వీటిలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఈఎస్ఐ నుంచి వచ్చిన మందులు, కిట్లు కుప్పలుగా బయటపడ్డాయి. వీటిని సీజ్ చేశారు. అసలు ఆ గోదాముల నడుస్తున్నదే ఈఎస్ఐ నుంచి వచ్చిన మందుల కోసమని తెలుసుకుని ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. వీటిని ఇతర హాస్పిటల్స్, మార్కెట్లలో విక్రయించగా వచ్చిన సొమ్మును పంచుకునేవారు. ఈ మందులను తెలంగాణలోనే కాదు, ఏపీకి కూడా విక్రయించినట్లు అధికారులు తేల్చారు. మొత్తం వ్యవహారంలో అతనికి కె.రామిరెడ్డి, లిఖిత్‌రెడ్డిలు సహకరించేవారు. ఈముగ్గురిని సోమవారం ఏసీబీ పోలీసులు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. అసలు వెంకటేశ్వర హెల్త్ కేర్ కంపెనీ అరవింద్ ఎప్పుడు ప్రారంభించాడు? దీని వెనక పద్మ హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. శశాంక్ గోయల్ పాత్రపైనా విచారించాల్సిందే.. ఐఎంఎస్ కుంభకోణంలో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ పాత్రపైనా విచారణ జరపాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ 2018, 2019లో రెండుసార్లు విజిలెన్స్ విచారణ జరిపి నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు చేపట్టలేదో తెలపాలన్నారు. ఆ రెండు నివేదికలను తొక్కిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మాజీ డైరెక్టర్ దేవికారాణి విషయంలో ఆయన ఉదాసీనంగా వ్యవహరిస్తూ కేవలం లేఖలతో సరిపెట్టారని మండిపడ్డారు. కానీ, మాజీ జేడీ పద్మ విషయంలో మాత్రం అక్రమాలు జరిగాయంటూ ఏసీబీకి లేఖ రాయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. -
కాలేజీ విద్యార్థిని చితకబాదిన లెక్చరర్
* స్పృహ కోల్పోయిన వైనం * బంధువుల ఆందోళన గంగాధర : ఓ విద్యార్థిని లెక్చరర్ చితకబాదడంతో స్పృహకోల్పోయిన ఘటన మండల కేంద్రంలోని తేజస్విని కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు విద్యార్థి బంధువులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని వెంకటాయిపల్లికి చెందిన బండ అరవింద్‌రెడ్డి గంగాధర చౌరస్తాలోని తేజస్విని కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. జ్వరంతో బాధపడుతూ కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన విద్యార్థి పది రోజులుగా కళాశాలకు వస్తున్నాడు. గురువారం మంచినీరు తాగేందుకు తరగతిగది నుంచి బయటకొచ్చాడు. గమనించిన లెక్చరర్ శ్రీనివాస్ ఎందుకొచ్చావని కొట్టాడు. ఎందుకు కొడుతున్నారని విద్యార్థి ప్రశ్నించడంతో విచక్షణ కోల్పోయిన లెక్చరర్ విద్యార్థిని చితకబాదడంతో అరవింద్‌రెడ్డి స్పృహ కోల్పోయూడు. ఈ విషయూన్ని తోటి విద్యార్థులకు గ్రామస్తులకు తెలపగా.. విద్యార్థి తండ్రి చంద్రారెడ్డి కళాశాలకు చేరుకొని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయినా స్పృహలోకి రాకపోవడంతో అంబులెన్స్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులతోపాటు, బంధువులు, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు కళాశాలకు చేరుకోని ఆందోళనకు దిగారు. కుర్చీలు, బెంచీలు ఎత్తివేసి ఓ లెక్చరర్‌పై చేయిచేసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
టీఆర్ఎస్కు అభ్యర్థులు కూడా లేరు: అరవింద్ రెడ్డి
కేసీఆర్ బేషరతుగా తన పార్టీ టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తన మాట నిలబెట్టుకోవాలని ఆ పార్టీ మాజీ సభ్యుడు, ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం టీఆర్ఎస్కు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్... మరి సోనియా, రాహుల్ గాంధీల వద్దకు ఒక్క దళితుడిని కూడా ఎందుకు తీసుకెళ్లలేదని ఆయన నిలదీశారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తాడని, తెలంగాణలోని 84 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీఆర్ఎస్కు సరైన అభ్యర్థులు కూడా లేరని ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి విమర్శించారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం వల్లే కాంగ్రెస్‌లో చేరానని ఆయన చెప్పారు. -
కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే అరవిందరెడ్డి
దిగ్విజయ్ సింగ్ సమక్షంలో చేరిక మంచిర్యాల, న్యూస్‌లైన్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో అరవిందరెడ్డి పార్టీలో చేరారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బలరాంనాయక్ వెంట ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు అరవిందరెడ్డి తెలిపారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విలీనం చేస్తానన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం బేషరతుగా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘తుంగభద్ర’పై రెండు లిప్టు స్కీంలు !
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదిపై రెండు లిప్టు స్కీంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ. 31 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి బి. అరవిందరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. కర్నూలు జిల్లా బెలగాల్ మండలం పరిధిలో తుంగభద్ర నదిపై కొత్తగా లిప్టు స్కీంను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ. 23.42 కోట్లను విడుదల చేశారు. ఈ స్కీం ద్వారా సుమారు 2,270 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. అలాగే ఇదే జిల్లాలో కౌతాలం పరిధిలో రూ. 8.58 కోట్లతో మరో లిప్టు స్కీంను నిర్మిస్తారు. దీన్ని ద్వారా 1,200 ఎకరాలకు సాగునీరు అందనుంది.