
విలీనమో, పొత్తో కేసీఆరే చెప్పాలి: కోమటిరెడ్డి
తెలంగాణ ఇస్తే తమ పార్టీని విలీనం చేస్తామని గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా చెప్పారని, ఇప్పుడు విలీనం ఉంటుందా.. లేక పొత్తు పెట్టుకుంటారా అనే విషయాన్ని ఆయనే చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తానిచ్చిన మాటను ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నిలబెట్టుకున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తాము తెలంగాణను తీర్చిదిద్దుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక తెలంగాణ ఇస్తే తమ పార్టీని విలీనం చేస్తామని గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా చెప్పారని, ఇప్పుడు విలీనం ఉంటుందా.. లేక పొత్తు పెట్టుకుంటారా అనే విషయాన్ని ఆయనే చెప్పాలని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ద్వంద్వ వైఖరి అవలంబించారని ఆయన ధ్వజమెత్తారు.