
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలను కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. శనివారం సోనియా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోమటిరెడ్డి మాట్లాడారు. ‘మిగులు బడ్జెట్‌తో మీరు ఇచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.3 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారు. తెలంగాణ సమస్యలపై పీఎం మోదీకి లేఖ రాయండి. తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఈ రాష్ట్రాన్ని మీరే కాపా డండి’అని సోనియాను కోరినట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment