గవర్నర్ నరసింహన్ ప్రసంగం అంతా తప్పులతడకగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ప్రసంగం అంతా తప్పులతడకగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వాయిదా అనంతరం ఆయన శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రభుత్వం గవర్నర్తో అసత్యాలు చెప్పిందని వ్యాఖ్యానించారు.
తొమ్మిది నెలల కాలంలో ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదన్నారు. లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పడం...గవర్నర్ ప్రసంగంలో అస్యతాలు ఉన్నాయనడానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.