హస్తం ఖాళీ | Congress to look up the conditions for the workers that are in the city of Nellore | Sakshi
Sakshi News home page

హస్తం ఖాళీ

Published Thu, Dec 26 2013 3:42 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress to look up the conditions for the workers that are in the city of Nellore

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు : కాంగ్రెస్‌కి కంచుకోటగా పేరున్న నెల్లూరు నగరంలోనే ఆ పార్టీ కార్యకర్తల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, ద్వితీయశ్రేణి నాయకులు పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు వలస వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మహానేత వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో ఒకరకమైన స్తబ్ధత  నెలకొంది. అయితే అటు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉండడంతో నాయకులు మనసును దిటవు చేసుకుని కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ప్రజల్లో
 
 తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక  కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే రాజకీయంగా తమ మనుగడకే ముప్పు తప్పదని నాయకులు ఆందోళనలో ఉన్నారు. సాధారణ ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో తమదారి తాము చూసుకోక తప్పదని భావించి ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ, టీడీపీ ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన నాయకులు పార్టీ మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా హామీలు కావాల్సిన నాయకులు మాత్రం సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ముహూర్తం మాత్రమే ఖరారు కావాల్సి ఉందని ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు వెల్లడించారు.
 
 ప్రజారాజ్యం పార్టీ తరుపున 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీధర్‌కృష్ణారెడ్డి అంతకు ముందు టీడీపీలోనే ఉన్నారు. అప్పటి పరిస్థితుల్లో ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తదనంతర పరిణామాల్లో పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఇప్పుడు కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా పార్టీ మారేందుకే మొగ్గు ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా సొంతగూటి నుంచి ఆహ్వానం రావడంతో సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తనతో కొనసాగుతున్న ముఖ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కొందరిని కూడా తన వెంట తీసుకెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాగా ఆనం సోదరులకు అత్యంత ముఖ్యుడైన ఒక మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై కొడుతున్నారు. ఈయన వైఎస్సార్‌సీపీలోకి వెళ్లనున్నట్లు తెలిసింది.  ఈయన తరువాత మరో ఐదారు మంది మాజీ కార్పొరేటర్లు సహా ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వైఎస్సార్‌సీపీలోకి వరుసపెట్టనున్నారు.  నెల్లూరు నగరంలో ప్రముఖులుగా పేరున్న కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆ పార్టీ నుంచి వెళ్లిపోవడం దాదాపుగా ఖాయమైంది. దీంతో నగరంలో చాలా డివిజన్లలో కాంగ్రెస్‌కు కార్యకర్తల కొరత తప్పదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
 
 ఆనం ఒంటెత్తు పోకడలతో విసుగు
 నెల్లూరు నగరాన్ని శాసిస్తూ వచ్చిన రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఒంటెద్దు పోకడలతో నగరంలోని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు విసిగెత్తిపోయారు. అటు పార్టీ పరంగానూ, ఇటు ప్రభుత్వ పరంగానూ తమకు ప్రాధాన్యం లేకుండాపోయిందని చాలా మంది ఆవేదనతో ఉన్నారు.
 
 కార్పొరేషన్‌కు సంబంధించిన కాంట్రాక్టులన్నీ ఇద్దరు ముగ్గురు నాయకులకే అప్పగించడంతో మిగిలినవారు కక్కలేక మింగలేక ఉండిపోయారు. కనీసం నగర పార్టీలో ప్రాతినిధ్యం దక్కుతుందని భావించిన కొందరు నేతలకు నిరాశే మిగిలింది. ఇంకా కాంగ్రెస్‌ను గానీ, ఆనం సోదరులనుగాని నమ్ముకుంటే రాజకీయంగా నష్టపోతామని భావిస్తున్న నేతలంతా ఇతర పార్టీల వైపు చూపు మరల్చారు. ఆనం వివేకానందరెడ్డి పోకడలు నచ్చక  సొంత సోదరుడు ఆనం జయకుమార్‌రెడ్డి రెండేళ్ల కిందటనే కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అదే బాట పట్టాయి.
 
 తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక  కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే రాజకీయంగా తమ మనుగడకే ముప్పు తప్పదని నాయకులు ఆందోళనలో ఉన్నారు. సాధారణ ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో తమదారి తాము చూసుకోక తప్పదని భావించి ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ, టీడీపీ ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
 
 ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన నాయకులు పార్టీ మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా హామీలు కావాల్సిన నాయకులు మాత్రం సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ముహూర్తం మాత్రమే ఖరారు కావాల్సి ఉందని ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీ తరుపున 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీధర్‌కృష్ణారెడ్డి అంతకు ముందు టీడీపీలోనే ఉన్నారు. అప్పటి పరిస్థితుల్లో ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తదనంతర పరిణామాల్లో పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఇప్పుడు కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా పార్టీ మారేందుకే మొగ్గు ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా సొంతగూటి నుంచి ఆహ్వానం రావడంతో సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తనతో కొనసాగుతున్న ముఖ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కొందరిని కూడా తన వెంట తీసుకెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాగా ఆనం సోదరులకు అత్యంత ముఖ్యుడైన ఒక మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై కొడుతున్నారు.
 
 ఈయన వైఎస్సార్‌సీపీలోకి వెళ్లనున్నట్లు తెలిసింది.  ఈయన తరువాత మరో ఐదారుగురు మాజీ కార్పొరేటర్లు సహా ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వైఎస్సార్‌సీపీలోకి వరుసపెట్టనున్నారు.  నెల్లూరు నగరంలో ప్రముఖులుగా పేరున్న కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆ పార్టీ నుంచి వెళ్లిపోవడం దాదాపుగా ఖాయమైంది. దీంతో నగరంలో చాలా డివిజన్లలో కాంగ్రెస్‌కు కార్యకర్తల కొరత తప్పదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
 
 ఆనం ఒంటెత్తు
 పోకడలతో విసుగు
 నెల్లూరు నగరాన్ని శాసిస్తూ వచ్చిన రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఒంటెత్తు పోకడలతో నగరంలోని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు విసిగెత్తిపోయారు. అటు పార్టీ పరంగానూ, ఇటు ప్రభుత్వ పరంగానూ తమకు ప్రాధాన్యం లేకుండాపోయిందని చాలా మంది ఆవేదనతో ఉన్నారు. కార్పొరేషన్‌కు సంబంధించిన కాంట్రాక్టులన్నీ ఇద్దరు ముగ్గురు నాయకులకే అప్పగించడంతో మిగిలినవారు కక్కలేక మింగలేక ఉండిపోయారు. కనీసం నగర పార్టీలో ప్రాతినిధ్యం దక్కుతుందని భావించిన కొందరు నేతలకు నిరాశే మిగిలింది. ఇంకా కాంగ్రెస్‌ను గానీ, ఆనం సోదరులనుగాని నమ్ముకుంటే రాజకీయంగా నష్టపోతామని భావిస్తున్న నేతలంతా ఇతర పార్టీల వైపు చూపు మరల్చారు. ఆనం వివేకానందరెడ్డి పోకడలు నచ్చక  సొంత సోదరుడు ఆనం జయకుమార్‌రెడ్డి రెండేళ్ల కిందటనే కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అదే బాట పట్టాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement