ఆర్మూర్, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనను పక్కన పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎలా అడ్డుకోవాలో కుట్ర పన్నుతున్నాడని ఆర్మూర్ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణ ఆరోపించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆర్మూర్ పట్టణ మున్సిపాలిటీ విద్యుత్ బిల్లులు చెల్లించలేని దుస్థితిలో ఉందన్నారు. ‘సి’ గ్రేడ్ మున్సిపాలిటీ కావడంతో నిధులు రావడం లేదన్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, బిల్లులు చెల్లించాలని అధికారులను కోరిన ట్లు చెప్పారు.
పట్టణానికి శ్రీరాంసాగర్ నుంచి తాగునీరందించే నీటి పథకం టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 71 లక్షలు ప్రణాళికేతర నిధులు మంజూరయ్యాయ ని, పార్టీలకతీతంగా వార్డులను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇవ్వడం వల్లనే రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ఇందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల ప్రకటనలే నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
‘తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర’
Published Tue, Aug 27 2013 3:19 AM | Last Updated on Mon, Aug 13 2018 4:01 PM
Advertisement